Kamalకు నోటీసులివ్వనున్న ఆరోగ్య శాఖ

ABN , First Publish Date - 2021-12-07T13:48:15+05:30 IST

‘మక్కల్‌ నీదిమయ్యం’ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్‌హాసన్‌పై రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా బారినుంచి ఆయన కోలుకున్నప్పటికీ.. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా ఆస్పత్రి నుంచి నేరుగా

Kamalకు నోటీసులివ్వనున్న ఆరోగ్య శాఖ

                      - కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన


అడయార్‌(చెన్నై): ‘మక్కల్‌ నీదిమయ్యం’ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్‌హాసన్‌పై రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా బారినుంచి ఆయన కోలుకున్నప్పటికీ.. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా ఆస్పత్రి నుంచి నేరుగా బిగ్‌బాస్‌ షూటింగ్‌ హౌస్‌కు వెళ్ళడంపై వివరణ కోరాలని నిర్ణయించింది. ఆ మేరకు ఆయనకు నోటీసులు పంపిస్తు న్నట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ సోమవారం వెల్లడించారు. ఇటీవల అమెరికా వెళ్ళి వచ్చిన కమల్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెల్సిందే. దీంతో ఆయన నవంబరు 22న నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఈనెల 4వ తేదీ ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అంతేకాకుండా, 4వ తేదీ నుంచి అన్ని పనులు చేసుకునేందుకు కమల్‌హాసన్‌ ఫిట్‌గా ఉన్నట్టు ఆస్పత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆయన ఆస్పత్రి నుంచి నేరుగా బిగ్‌బాస్‌ షూటింగ్‌కు వెళ్ళారు. ఇది కొవిడ్‌ నిబంధనలకు వ్యతిరేకం. కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత ఒక వారం రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలన్న నిబంధన ఉంది. దీనిని పాటించకుండా కమల్‌ హాసన్‌ షూటింగ్‌కు వెళ్ళడంపై కమల్‌ హాసన్‌ వద్ద వివరణ కోరుతామని రాధాకృష్ణన్‌ వెల్లడించారు.

Updated Date - 2021-12-07T13:48:15+05:30 IST