కమల స్పెషల్ రెసిపీ.. మీరూ ఓ లుక్కేయండి!

ABN , First Publish Date - 2020-11-25T16:45:00+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి, అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలిగా ఎంపికైన తొలి మహిళ కమలా హ్యారిస్ తన పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని మరోసారి చూపించారు.

కమల స్పెషల్ రెసిపీ.. మీరూ ఓ లుక్కేయండి!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి, అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలిగా ఎంపికైన తొలి మహిళ కమలా హ్యారిస్ తన పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని మరోసారి చూపించారు. మామూలుగానే కమలకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. తన మనసు బాగలేని ప్రతిసారీ వంట చేస్తానని, దాంతో తన మనసు కుదుట పడుతుందని ఆమె చాలాసార్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఆమె మరోసారి తన కుకింగ్ నైపుణ్యాలను ప్రదర్శించారు. తాను చేసిన వంట రెసిపీని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీన్ని ఇప్పటి వరకూ 2.5లక్షల మంది వరకూ లైక్ చేశారు.


అమెరికన్లు ప్రముఖంగా చేసుకునే పండుగల్లో థ్యాంక్స్ గివింగ్ డే ఒకటి. ఈ పండుగ రోజు అమెరికన్లు తమ చుట్టుపక్కల వారితో, స్నేహితులతో కలిసి భోజనం చేస్తారు. ఆ సాయంత్రాన్ని చాలా సరదాగా గడుపుతారు. ఈ పండుగను తమ ఇంట్లో ఎప్పుడు చేసుకున్నా కమల చేసే కార్న్‌బ్రెడ్ డ్రెసింగ్ తప్పనిసరి అంట. ఈ క్రమంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది. ‘ఈ థ్యాంక్స్ గివింగ్ డేకి మా కుటుంబానికి ఎంతో ఇష్టమైన ఓ రెసిపీని మీతో పంచుకోవాలని అనుకుంటున్నా’ అని ఆమె చెప్పారు. ఈ వంట చేసిన ప్రతిసారీ తనకు చాలా సంతోషంగా ఉంటుందని, తన పోస్టు చూసి ఈ వంట చేసే వారందరికీ అలాంటి అనుభూతే కలగాలని కోరుకుంటున్నానని ఆమె పేర్కొంది. ఒంటరి తనాన్ని మర్చిపోవడానికి కూడా తనకు ఈ వంటకం ఉపయోగపడుతుందని తెలిపింది.



ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ గెలిచారు. ఆయనతోపాటు ఉపాద్యక్షురాలిగా పోటీ చేసిన కమల కూడా ఘన విజయం సాధించారు. దీంతో ఆమె అగ్రరాజ్య ఎన్నికల్లో చరిత్ర సృష్టించారు. వచ్చే ఏడాది జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్న ఆమె.. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ. అంతేకాదు ఈ పదవి చేపట్టబోయే తొలి నల్లజాతి మహిళ. అలాగే తొలి దక్షిణాసియా మూలాలున్న వ్యక్తి. కమలకు వంటలంటే చాలా ఇష్టం. గతంలో కూడా సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ విషయాన్ని చాలాసార్లు వెల్లడించారు. గతేడాది మిండీ కాలింగ్‌తో కలిసి కొన్ని దోశలు కూడా వేశారు. కమల భారతీయ మూలాలున్న మహిళ కావడంతో అప్పట్లో ఈ వీడియో చాలా పాపులర్ అయింది. ఇప్పుడు ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన ‘కమల కార్న్ బ్రెడ్ డ్రెసింగ్’ రెసిపీ ఏంటో మీరు కూడా చూసేయండి.

Updated Date - 2020-11-25T16:45:00+05:30 IST