బైడెన్‌ను ప్రశంసలతో ముంచెత్తిన కమలా హ్యారిస్ !

ABN , First Publish Date - 2020-11-28T21:44:41+05:30 IST

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రటిక్ నేత జో బైడెన్‌ను ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్ ప్రశంసలతో ముంచెత్తారు.

బైడెన్‌ను ప్రశంసలతో ముంచెత్తిన కమలా హ్యారిస్ !

ప్రపంచం గౌరవించే నాయకుడు, అమెరికన్లందరికీ అధ్యక్షుడు బైడెన్: కమలా హ్యారిస్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రటిక్ నేత జో బైడెన్‌ను ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్ ప్రశంసలతో ముంచెత్తారు. బైడెన్.. అమెరికన్లను తలెత్తుకునేలా పరిపాలిస్తాడని చెప్పారు. ఆయన అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటారని తెలిపారు. అన్నింటా అగ్రరాజ్యాన్ని అగ్రస్థానంలో నెలబెడతారని, ప్రపంచం మొత్తం ఆయనను గౌరవించేలా హుందాగా ఉంటారని కమల అన్నారు. "బైడెన్ మనలో ఉత్తమమైనవారిని సూచించే అధ్యక్షుడిగా ఉంటారనడంలో సందేహం లేదు. ప్రపంచం గౌరవించే నాయకుడు ఆయన. మునుముందు మన పిల్లలు ఇది చూడబోతున్నారు. మన రక్షణ దళాలను గౌరవించే, మన దేశాన్ని సురక్షితంగా ఉంచే కమాండర్ ఇన్ చీఫ్ మరియు అమెరికన్లందరికీ అధ్యక్షుడు." అని కమల ట్వీట్ చేశారు. ఇక 56 ఏళ్ల కమల.. అమెరికాకు తొలి మహిళ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.   



Updated Date - 2020-11-28T21:44:41+05:30 IST