‘గో - గెట్టర్‌’ స్టైల్‌!

ABN , First Publish Date - 2020-11-09T05:32:27+05:30 IST

డ్రెస్సింగ్‌, హెయిర్‌స్టైల్‌, షూస్‌ ద్వారా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలని ఎంతో మంది ప్రయత్నిస్తారు. అయితే ఆ స్టైల్స్‌ను హూందాగా క్యారీ చేయడం కొందరికే సాధ్యపడుతుంది. ఆ కొందర్లో కమలా హ్యారిస్‌ ఒకరు! మీమాంసకు తావు లేకుండా, వెనకడుగు ప్రసక్తే లేకుండా... కట్టె, కొట్టె, తెచ్చె చందం లాంటి ఆమె మనస్తత్వం ఆమె అటైర్‌లోనే రిఫ్లెక్ట్‌ అవుతోంది...

‘గో - గెట్టర్‌’ స్టైల్‌!

డ్రెస్సింగ్‌, హెయిర్‌స్టైల్‌, షూస్‌ ద్వారా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలని ఎంతో మంది ప్రయత్నిస్తారు. అయితే ఆ స్టైల్స్‌ను హూందాగా క్యారీ చేయడం కొందరికే సాధ్యపడుతుంది. ఆ కొందర్లో కమలా హ్యారిస్‌ ఒకరు! మీమాంసకు తావు లేకుండా, వెనకడుగు ప్రసక్తే లేకుండా... కట్టె, కొట్టె, తెచ్చె చందం లాంటి ఆమె మనస్తత్వం ఆమె అటైర్‌లోనే రిఫ్లెక్ట్‌ అవుతోంది అనేది ప్రముఖ డిజైనర్ల అభిప్రాయం!


అగ్రరాజ్యం అమెరికా ఉన్నత పదవులు అధిరోహించిన మహిళలు పవర్‌ఫుల్‌ డ్రెస్సింగ్‌తో శక్తివంతమైన సందేశాలను అందిస్తూ ఉంటారు. అమెరికా మాజీ ఫస్ట్‌ లేడీ జాక్విలిన్‌ కెనడీ లంచ్‌ సూట్స్‌ వేస్తే, మిషెల్లీ ఒబామా అదిరిపోయే గౌన్లతో అబ్బురపరిచారు. తాజాగా కమలా హ్యారిస్‌ కన్వర్స్‌ స్నీకర్స్‌, ముత్యాల హారాలతో అమెరికన్ల మనసులు కొల్లగొట్టగలిగారు. 


  1. గత 34 ఏళ్లుగా కమల మెడలో ముత్యాల హారాలను ధరిస్తూనే ఉన్నారు. ముత్యాలు విశ్వాసం, నమ్మకాలకు ప్రతీక. వీటిని ధరించడం ద్వారా ప్రజల నమ్మకాన్ని చూరగొనగలిగారనే చెప్పాలి. అదే సమయంలో స్నీకర్స్‌ ధరిస్తూ తన సిగ్నేచర్‌ స్టైల్‌కు అదనపు విలువను జోడించారు. అలాగే నలుపు, గ్రే, న్యావీ బ్లూ రంగుల సూట్లు, స్కర్టులు, నేచురల్‌ మేకప్‌ ఆమెకు హూందాతనాన్ని తెచ్చిపెట్టాయి అంటున్నారు డిజైనర్‌ ప్రియా కటారియా పూరి.
  2. బిజినెస్‌ సూట్‌ను స్నీకర్స్‌తో కలిపి ధరించడం ద్వారా, పాయింటీ స్టిలెటోస్‌ మొదలు ట్రైనర్స్‌ను ఎంచుకోవడం ద్వారా ఆమె గో - గెట్టర్‌ నైజాన్ని చెప్పకనే చెప్పారు అంటున్నారు డిజైనర్‌ షేన్‌ పీకాక్‌!

Updated Date - 2020-11-09T05:32:27+05:30 IST