సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్.. సురక్షిత ప్రాంతానికి కమలా హారిస్ భర్త తరలింపు

ABN , First Publish Date - 2022-02-09T22:30:15+05:30 IST

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త, సెకండ్ జెంటిల్‌మ్యాన్ డగ్లస్ ఎమ్హోఫ్ భద్రతకు ముప్పు వాటిల్లడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించిన ఘటన మంగళవారం చోటు చే

సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్.. సురక్షిత ప్రాంతానికి కమలా హారిస్ భర్త తరలింపు

ఎన్నారై డెస్క్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త, సెకండ్ జెంటిల్‌మ్యాన్ డగ్లస్ ఎమ్హోఫ్ భద్రతకు ముప్పు వాటిల్లడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బ్లాక్ హిస్టరీ మంత్ వేడుకల్లో భాగంగా డగ్లస్ ఎమ్హోఫ్.. వాషింగ్టన్‌లోని డన్‌బార్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రామానికి హాజరయ్యారు. ఈ క్రమంలో డగ్లస్ ఎమ్హోఫ్ పాల్గొన్న కార్యక్రమంలో బాంబు దాడి జరిగే ప్రమాదం ఉందనే సమాచారంతో ఆయన సెక్యురిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. వెంటనే డగ్లస్ ఎమ్హోఫ్‌ను అక్కడి నుంచి తరలించారు. అంతేకాకుండా విద్యార్థులను కూడా స్కూల్‌ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ క్రమంలో విద్యార్థులు కూడా పాఠశాల నుంచి వెళ్లిపోయారు. అందరూ సురక్షితంగా ఉన్నట్టు వాషింగ్టన్ పబ్లిక్ స్కూల్ అధికార ప్రతినిధి వెల్లడించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ అయింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. 




Updated Date - 2022-02-09T22:30:15+05:30 IST