మహారాష్ట్ర CM Uddhav Thackeray కి కరోనా.. పొద్దున గవర్నర్‌కి కూడా నిర్ధారణ..

ABN , First Publish Date - 2022-06-22T18:31:54+05:30 IST

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

మహారాష్ట్ర CM Uddhav Thackeray కి కరోనా.. పొద్దున గవర్నర్‌కి కూడా నిర్ధారణ..

ముంబై :  మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం(Maharastra political Crisis) వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకి(Uddav thackerey) కరోనా పాజిటివ్‌(corona possitive)గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఐసొలేషన్‌లో ఉన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత కమల్‌నాథ్(kamal nath) ప్రకటించారు. సీఎం ఉద్ధవ్ థాక్రే కరోనా బారిన పడ్డారని ఆయన వెల్లడించారు. కీలకమైన కేబినెట్ భేటీకి ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో సీఎం ఉద్ధవ్ థాక్రేతో భేటీ సాధ్యపడలేదన్నారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమావేశంలో పాల్గొంటారా లేదా అనేది ఇంకా వెల్లడికాలేదు.


 కాగా బుధవారం ఉదయమే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ(Bhagat Singh Koshyari) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు గవర్న్ కొశ్యారీ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ నాకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తతో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను’’ అని కొశ్యారీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-06-22T18:31:54+05:30 IST