Abn logo
Mar 30 2021 @ 02:16AM

కమల్‌వి మార్కెటింగ్‌ ఎత్తుగడలు

ఎన్నికల్లో బెడిసికొట్టడం ఖాయం

నటి, బీజేపీ నేత గౌతమి విమర్శ


చెన్నై, మార్చి 29(ఆంధ్రజ్యోతి): తమిళనాట మార్పులు తీసుకువస్తానని చెబుతున్న మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్‌వి మార్కెటింగ్‌ ఎత్తుగడలని, అవి శాసనసభ ఎన్నికల్లో బెడిసికొడతాయని ప్రముఖ సినీనటి గౌతమి విమర్శించారు. చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి, ప్రస్తుత ప్రధాని మోదీకి తాను వీరాభిమానని, 23 ఏళ్లుగా బీజేపీపై ఆసక్తి పెరిగిందని, ఆ కారణంగానే బీజేపీలో చేరి పార్టీకి సేవలందిస్తున్నానని చెప్పారు. ద్రావిడ పార్టీల ప్రాబల్యం అధికంగా ఉన్న రాష్ట్రంలో ఆ పార్టీల్లోనే చేరాలనే నిర్బంధం ఏమీ లేదని తెలిపారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో కమల్‌ తెలుసుకుంటే మంచిదని సూచించారు. ఆ పార్టీ చెబుతున్న మార్పులు తమకు కావాలా? వద్దా? అనే ప్రశ్నకు మే 2న ప్రజలు సమాధానం చెబుతారని అన్నారు. పార్టీని ప్రారంభించే ప్రతి వ్యక్తి మార్పులు తీసుకువస్తామని చెప్పడం ఆనవాయితీగా మారిందని, కమల్‌ పార్టీ మక్కల్‌ నీదిమయ్యం కూడా ఇలాంటి మార్కెటింగ్‌ ఎత్తుగడలు వేస్తోందని విమర్శించారు. 

Advertisement
Advertisement