Abn logo
Sep 16 2020 @ 18:55PM

`ఖైదీ` డైరెక్టర్‌తో కమల్!

`ఖైదీ` సినిమాతో అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ ట్యాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు లోకేష్ కనకరాజ్. తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా లోకేష్ రూపొందించిన `మాస్టర్` సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కేవలం మూడు సినిమాల అనుభవం మాత్రమే ఉన్న లోకేష్ తాజాగా ఓ గొప్ప అవకాశాన్ని దక్కించుకున్నాడు. 


విశ్వనటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా ఓ సినిమా రూపొందించబోతున్నాడు. కమల్ అభిమాని అయిన లోకేష్ ఆయన నటించబోయే 232వ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన బయటకు వచ్చింది. కమల్ స్వంత నిర్మాణ సంస్థ `రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్` ఈ సినిమాను నిర్మించబోతోంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement
Advertisement
Advertisement