Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 30 Jun 2022 10:42:50 IST

చాలా గర్వంగా ఉంది: Kamal Haasan

twitter-iconwatsapp-iconfb-icon

ఇటీవల మన సౌత్ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రిలీజైన విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) విక్రమ్ (Vikram) మూవీ భారీ వసూళ్లతో అరదరగొట్టిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ (Lokesh kanagraj) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay setupathi), ఫహద్ ఫాజిల్ (Fahad Fasil) అద్భుతమైన పాత్రల్లో నటించారు. అయితే, వీరికన్నా స్టార్ హీరో సూర్య (Surya) చేసిన రోలెక్స్ పాత్ర అందరినీ మెస్మరైజ్ చేసింది. మంచి పాత్ర దొరకాలే గానీ సూర్య అందులో జీవించడానికి ఎంతైనా శ్రమిస్తారు.

అలాంటిది కమల్ సినిమాలో పాత్ర అంటే, అది చిన్నదైనా ప్రాణం పెట్టేస్తారు. అలాగే చేశారు సూర్య. విక్రమ్ సినిమాలో ఆయన పోషించిన రోలెక్స్ పాత్రకు సినీ ప్రముఖుకుల నుంచి గొప్ప గొప్ప ప్రశంసలు దక్కాయి. ఇక సూర్య నటించడానికి ఒప్పుకున్నందుకు రోలెక్స్ పాత్రలో అద్భుతంగా పర్ఫార్మ్ చేసినందుకు కమల్..సూర్యను ప్రత్యేకంగా అభినందించి ఖరీదైన రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మరోసారి సూర్యను కమల్ ప్రశంసిస్తూ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 

తాజాగా ప్రపంచ దిగ్గజ అవార్డు వేడుకలు ఆస్కార్ అకాడమీ నుంచి సూర్యకి కూడా ఒక మెంబర్‌గా ఆహ్వానం రావడం ఇప్పుడు అంతటా ఆసక్తిగా మారింది. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రముఖులు దీని గురించి చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఈ సందర్భంగా సూర్యకు విషెస్ తెలిపారు. అయితే, కమల్ హాసన్ కూడా తన బెస్ట్ విషెష్‌ను తెలియజేయడం ఆసక్తిగా మారింది. 'నా బ్రదర్ సూర్యకి ఆస్కార్ నుంచి పిలుపు వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది'..అని ట్వీట్ చేసిన కమల్, ఈ మూమెంట్‌ను గర్వంగా ఎంజాయ్ చెయ్యమని సూచిస్తూ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనితో ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement