ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal haasan) దేశ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఉత్తరాది, దక్షిణాది అనే తారతమ్యాలు వద్దని పిలుపునిచ్చారు. నిజానికి మనదేశంలో నార్త్ ఇండియా (North India) , సౌత్ ఇండియా (South India) అని పిలుస్తుంటారు. ఉత్తరాది రాష్ట్రాల కంటే, దక్షిణాది రాష్ట్రాలు అన్ని రకాలుగా ప్రగతిపథంలో ఉన్నాయి. దీన్ని రాజకీయ నేతలు తమ స్వలాభాల కోసం బాగానే వాడుకుంటున్నారు. ఇదే సంస్కృతి ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమకు పాకింది. దీంతో పలువురు బాలీవుడ్ (Bollywood), దక్షిణాది నటులు మధ్య మాటల యుద్ధం సాగింది.
ఈ క్రమంలో కేన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొన్న కమల్ హాసన్ (Kamal haasan) అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఎల్లపుడూ ఒక భారతీయుడుగానే భావిస్తాను. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నేను సౌకర్యవంతంగా ఉండగలను. అదే బహుళత్వం కలిగిన భారతదేశ అందం. ఉత్తరాది, దక్షిణాదిల్లో ఉన్న అపారమైన ప్రతిభ బాగా తెలుసు. అందువల్ల దాన్ని విభజించి చూడరాదు’ అని అభిప్రాయపడ్డారు. కాగా, కమల్ హాసన్ నటించిన కొత్త చిత్రం ‘విక్రమ్’ (Vikram) జూన్ 3వ తేదీన విడుదలకానుంది. సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh ravichandran), లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకుడు. రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ (Rajkamal Film International) పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మించారు.