Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 29 May 2022 12:04:53 IST

Kamal Haasan: ఆ సినిమాలో నటించాలని ఆ దిగ్గజ నటుడిని చేయిపట్టి వేడుకున్నా.. కానీ..

twitter-iconwatsapp-iconfb-icon

దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమిళ నటుడు కమల్ హాసన్. ఎటువంటి పాత్రనైనా అవలీలగా చేయగల ఈ స్టార్‌ని అభిమానులు లోకనాయకుడు అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘విక్రమ్’. ఈ మూవీ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ జూన్ 3న విడుదల కానుంది. దీంతో చిత్రబృందం మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సినిమాల గురించి కమల్ హాసన్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.


కమల్ ప్యాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతూ.. ‘సినిమాలు యూనివర్సల్ భాష మాట్లాడతాయి. మనది అటువంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. ఒక దేశంగా మనం ఒకే భాష మాట్లాడటం లేదు. కానీ జాతీయ గీతాన్ని మాత్రం ఒకటిగానే గర్వంగా పాడతాం. అలా ప్రజలను ఏకం చేసే వాటిలో సినిమాలు ఉంటాయి. మీ పక్కన కూర్చున్న వ్యక్తి కులాన్ని, ప్రాంతాన్ని అడగని ఒకే ప్రదేశం సినిమా హాలు.


అక్కడ విజయం సాధిస్తున్నది సౌత్ సినిమా కాదు ఇండియన్ సినిమా. ఓ హాలీవుడ్ మూవీ ఇక్కడ విజయం సాధించడం కంటే ఇది చాలామంచి పరిణామం. మొఘల్-ఈ-ఆజం, షోలే, అనేక ఇతర సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విజయవంతమవ్వడం గతంలో చూశాం. మనం ఈ స్థాయికి చేరడానికి దశాబ్దాలు పట్టింది. అందుకే ఒకరినొకరు గౌరవించుకోవాలి. సినిమాలకు ఒకే భాష ఉండకపోవచ్చు. కానీ సినిమాలన్నీ ఒక్కటే’ అని చెప్పుకొచ్చారు.


కమల్ 1980లలో ఏక్ దుజే కే లియే, సాగర్ మొదలైన అనేక హిందీ చిత్రాలలో పనిచేశారు. ఈ సందర్భంలో కమల్ బాలీవుడ్ స్టార్ దీలిప్ కుమార్‌తో నటించే అవకాశం కోల్పోయారు. దాని గురించి మాట్లాడుతూ.. ‘నాకు ఇతర నటీనటులతో నటించడం అంటే చాలా ఇష్టం. అయితే నేను కలిసి పనిచేయాలని కోరుకుని, పని చేయలేని నటుడు ఒకరు ఉన్నారు. ఆయనే దీలిప్ కుమార్. నేను ‘తేవర్ మగన్‌’ అనే సినిమాని హిందీలో రీమేక్ చేద్దామని అనుకున్నాను. అందులో నాతో కలిసి నటించమని కోరడానికి దీలిప్ కుమార్‌ని కలిశాను. ఆయన చేతులు పట్టుకొని ఆ సినిమాలో నటించాలని వేడుకున్నా. కానీ.. ఆయన ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు’ అని కమల్ తెలిపారు. అయితే.. అనంతరం అదే సినిమాని అనిల్ కపూర్, అమ్రిష్ పూరీ కాంబినేషన్‌లో ‘విరాసత్‌’గా హిందీలో తెరకెక్కింది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

OtherwoodsLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement