త్రిపురాంబిక అలంకారంలో కామాక్షితాయి

ABN , First Publish Date - 2022-09-28T04:15:44+05:30 IST

దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మండలంలోని జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో మంగళవారం కామాక్షితాయి త్రిపురాంబిక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

త్రిపురాంబిక అలంకారంలో కామాక్షితాయి
త్రిపురాంబిక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన కామాక్షితాయి

బుచ్చిరెడ్డిపాళెం,   సెప్టెంబరు 27:  దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మండలంలోని జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో మంగళవారం కామాక్షితాయి త్రిపురాంబిక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో పుణ్యహవచనం, రాత్రి 7గంటలకు అమ్మవారికి అభిషేకం, కాళరాత్రి మహానవావరణ పూజల అనంతరం కొలువులు చేశారు. ఈకార్యక్రమానికి గంగవరం గ్రామానికి చెందిన శింగారెడ్డి లక్ష్మీనరసారెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యంనాయుడు, ఏసీ,ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు, పాలకమండలి సభ్యులు పర్యవేక్షించారు. సాయంత్రం ఆలయంలో భక్తులకు చిట్టమూరు వెంకటరెడ్డితోపాటు పలువురు దాతలు ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. కామాక్షితాయి నిత్యాన్నదానంతోపాట ఓ భక్తబృందం ఆద్వర్యంలో మరో అన్నదాన సదనంలో కూడా ఉచిత భోజన వసతి ఏర్పాటు చేశారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా బుధవారం కామాక్షితాయి రక్తబీఽజవధ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ముస్తాబైన ఆలయాలు

బుచ్చిరెడ్డిపాళెంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం,  కల్యాణ వేంకటేశ్వరస్వామి, కన్యకాపరమేశ్వరి ఆలయాలు, దర్గమ్మగుడి, కనిగిరి రిజర్వాయర్‌ వద్ద దుర్గామల్లేశ్వరాలయం, మండలంలోని రేబాలలో పుట్టాలమ్మ తదితర గ్రామాల్లోని పలు ఆలయాలు దసరా ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. 

కామాక్షితాయి దర్శనంలో రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, డిప్యూటి మేయర్‌ రూప్‌కుమార్‌యాదవ్‌, అలాగే  కృష్ణపట్నంపోర్టు సీఈవో జగన్నాఽథరావు, నందకిషోర్‌, కృష్ణారెడ్డి మంగళవారం శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయివార్లను దర్శించుకున్నారు. ముందుగా చైర్మన్‌ పుట్టా సుబ్రమణ్యంనాయుడు, ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు సభ్యులు టి.నందకుమార్‌, అర్చకులు వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్దప్రసాదాలను అందజేశారు. చైర్మెన్‌, ఈవో వారిని పూలమాల, శాలువాలతో సత్కరించి అర్చకులతో ఆశీర్వాదాలు అందజేశారు.

చండీగా దుర్గాదేవి

 మనుబోలు: స్థానిక కోదండరామపురంలో సోమవారం రాత్రి నుంచి దేవీశరన్నవరాత్రులు ప్రారంభించారు. రెండోరోజు మంగళవారం  దుర్గాదేవిని చండీ పరమేశ్వరీగా అలంకరించారు. దసరాకమిటీ ఉభయదాతలుగా వ్యవహరించారు.  పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. 




Updated Date - 2022-09-28T04:15:44+05:30 IST