Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 14 Aug 2022 17:01:50 IST

Kamaal R Khan: Aamir Khan కెరీర్‌ను నాశనం చేశా.. ఇక Shah Rukh Khan, Salman Khan లకు కూడా అదే గతి తప్పదంటూ..

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) హీరోగా నటించిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). టామ్ హ్యాంక్స్ నటించిన ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. కరీనా కపూర్, నాగచైతన్య కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదలైంది. ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మిక్స్‌డ్ రివ్యూస్ లభించాయి. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. ఈ సినిమా పరాజయం పాలవ్వడానికీ తానే ముఖ్య కారణమని బాలీవుడ్ సినీ విమర్శకుడు కమల్ ఆర్. ఖాన్ (Kamaal R Khan) చెప్పాడు. 


ఆమిర్ ఖాన్ కెరీర్‌ను పూర్తిగా తానే నాశనం చేశానని కేఆర్‌కే తెలిపాడు. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లకు ఇదే గతి పట్టిస్తానన్నాడు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘సోదరుడా షారూఖ్ ఖాన్. ఆమిర్ ఖాన్ కెరీర్‌ను పూర్తిగా నాశనం చేశాను. ప్రస్తుతం నీ వంతు వచ్చింది. ‘పఠాన్’ తో పాటు, సల్మాన్ చిత్రం మిగిలి ఉంది. మీరిద్దరు కూడా సినిమాలను త్వరగా విడుదల చేయండి. వేచి ఉండలేకుండా పోతున్నాను. మీ సినిమా విజయం సాధిస్తుందని 1శాతం సందేహం ఉన్న సరే, షారూఖ్ ఖాన్‌ని మీ చిత్రంలో అతిథి పాత్ర చేయమని అడగండి. అప్పుడు ఆ మూవీ తప్పకుండా 100శాతం పరాజయం పాలవుతుంది’’ అని కమల్ ఆర్. ఖాన్ తెలిపాడు. ‘లాల్ సింగ్ చడ్డా’ రాఖీ కానుకగా థియేటర్స్‌లోకి వచ్చింది. మెట్రో ప్రాంతాల్లోని ప్రేక్షకులు సినిమాని బాగానే ఆదరించారు. మాస్ సర్క్యూట్స్‌లోని వారి నుంచి చిత్రానికి చాలా తక్కువ స్పందన వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం మొదటి రోజు రూ.11.70కోట్ల వసూళ్లను రాబట్టింది. సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపకపోవడంతో మొదటి రోజే 1300 షోస్‌ను క్యాన్సిల్ చేశారు. దీంతో ఆ కలెక్షన్స్ మరింత తగ్గాయి. ఫలితంగా ఈ చిత్రం రెండో రోజు రూ. 7.26కోట్ల కలెక్షన్స్‌ను, మూడో రోజు రూ. 9కోట్లను మాత్రమే సాధించింది. మూడు రోజులకు గాను ఈ సినిమా రూ. 27.96కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఆమిర్ స్టార్‌డమ్‌తో పోల్చుకుంటే ఈ కలెక్షన్స్ మూడు రోజులకు గాను రూ. 70కోట్లను దాటాలి. కానీ, ఈ చిత్రం సగం వసూళ్లను కూడా రాబట్టలేకపోవడం విశేషం.



Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement