Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 01 Jul 2022 19:47:49 IST

Kalyanram ‘బింబిసార’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

twitter-iconwatsapp-iconfb-icon

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బింబిసార’ (Bimbisaara ). తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. గతంలో అల్లు అర్జున్‌ (Allu Arjun)తో బన్నీ, మాస్ మహారాజ రవితేజ (Raviteja)తో భగీరథ సినిమాలను నిర్మించిన మల్లిడి సత్యనారాయణ తనయుడు మల్లిడి వశిష్ట్ (Mallidi Vashist) తొలిసారిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా ఈ చిత్రం తయారవుతుంది. 

చారిత్రక నేపథ్యంతో పాటు ఇటు సోషల్ జానర్‌లోనూ సాగనున్న ‘బింబిసార’ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ (NTR Arts) పతాకంపై కె హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అభిమానులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందిస్తుండగా, చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని జులై 4న విడుదల చేయబోతున్నారు.

ఈ మేరకు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటన ఇచ్చింది. నందమూరి అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ అందరూ ఈ సినిమా కోసం ఎప్పటినుండో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. "ఓ యుద్ధం మీదపడితే ఎలా ఉంటుందో చూస్తారు" అనే డైలాగ్‌తో ‘బింబిసార’ చిత్ర ట్రైలర్‌కి సంబందించిన చిన్న వీడియోను రిలీజ్ చేసింది. కాగా, ఈ సినిమా అత్యంత భారీ స్థాయిలో ఆగష్టు 5 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఇందులో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనుండగా..ఆయన సరసన కేథరీన్ థ్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon), వారినా హుస్సేన్ (Warina Hussain) హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement