కల్యాణపులోవ నీరు విడుదల

ABN , First Publish Date - 2022-08-10T06:18:46+05:30 IST

కల్యాణపులోవ రిజర్వాయర్‌ ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో మంగళవారం కూడా రెండు గేట్లు ద్వారా 140 క్యూసెక్కుల నీటి సర్పానదిలోకి విడుదల చేసినట్టు ఇరిగేషన్‌ కొత్తకోట సెక్షన్‌ ఏఈ సత్యనారాయణ దొర తెలిపారు.

కల్యాణపులోవ నీరు విడుదల
కల్యాణపులోవ నుంచి నీరు విడుదల చేస్తున్న దృశ్యం


రావికమతం, ఆగస్టు 9: కల్యాణపులోవ రిజర్వాయర్‌ ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో మంగళవారం కూడా రెండు గేట్లు ద్వారా 140 క్యూసెక్కుల నీటి సర్పానదిలోకి విడుదల చేసినట్టు ఇరిగేషన్‌ కొత్తకోట సెక్షన్‌ ఏఈ సత్యనారాయణ దొర తెలిపారు. రిజర్వాయర్‌ ఎగువన కురుస్తున్న వర్షాలకు 180 క్యూసెక్కులపైగా వరద నీరు ఇన్‌ఫ్లో వస్తున్నది. దీంతో జలాశయం నీటిమట్టం 459.10 అడుగుల వద్ద స్ధిరంగా ఉంచుతూ, అదనపు నీటిని విడిచి పెడుతున్నామన్నారు. అందువల్ల సర్పానదీ పరివాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

Updated Date - 2022-08-10T06:18:46+05:30 IST