కల్యాణపులోవ గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-08-08T05:49:13+05:30 IST

కల్యాణపులోవ పరివాహక ప్రాంతంలో ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది.

కల్యాణపులోవ గేట్లు ఎత్తివేత
రెండు గేట్లు ఎత్తి సర్పానదికి నీరు విడిచిపెడుతున్న దృశ్యం

- నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో రెండు గేట్లు ఎత్తి సర్పానదిలోకి నీరు విడుదల

రావికమతం, ఆగస్టు 7: కల్యాణపులోవ పరివాహక ప్రాంతంలో ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. రిజర్వాయర్‌ సామర్థ్యం 460 అడుగులు కాగా ప్రస్తుతం 459.30 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో ఆదివారం మళ్లీ రెండు గేట్లు ఎత్తి 150 క్యూసెక్కుల నీటిని సర్పానదిలోకి విడిచిపెట్టారు. దిగువ గ్రామాల ప్రజలు నదిని దాటి వెళ్లరాదని కల్యాణపులోవ రిజర్వాయర్‌ కొత్తకోట సెక్షన్‌ ఏఈ సత్యనారాయణదొర హెచ్చరించారు. కాగా ఈ రిజర్వాయర్‌ నీటిమట్టం ఈ నెలలో ఇప్పటికి నాలుగుసార్లు ప్రమాద స్థాయికి చేరడంతో నాలుగు దఫాలు ఇరిగేషన్‌ అధికారులు గేట్లు ఎత్తారు.

 

Updated Date - 2022-08-08T05:49:13+05:30 IST