లోకేశ్వరం గజ్జలమ్మ ఆలయంలో శివపార్వతుల కళ్యాణం
లోకేశ్వరం, డిసెంబరు 3 : మండల కేంద్రం లోకే శ్వరంలోని గజ్జలమ్మ ఆలయంలో బుధవారం రాత్రి శివపార్వతుల కళ్యాణం కమనీయం రమనీయంగా జరిగింది. ఉదయం ఆలయంలో కుంకుమార్చన మం డల పూజ, తదితర కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కొనసాగింది. రాత్రి వేళలో శివ పార్వతుల కళ్యాణం రమణీయంగా సాగింది. ఈ కళ్యాణానికి మెండె శ్రీకళశ్రీధర్ దంపతులు పాల్గొని ప్రత్యేకపూజలు చేశారు. ఈ కళ్యాణానికి గ్రామ మహి ళలు హారతులతో హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ జయసాగర్‌రావు, ఆలయ కమిటీ సభ్యులు శంకర్, రవి, సురేష్, మోహన్, నాగేశ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.