పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి ఆసరా

ABN , First Publish Date - 2022-01-21T05:58:07+05:30 IST

రాష్ట్రంలో పేదింటి ఆడపడుచుల పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ఆసరాగా నిలిచాయని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి ఆసరా
చెక్కుల పంపిణీ చేయడానికి వచ్చిన మంత్రి జగదీ్‌షరెడ్డికి హారతులిస్తున్న మహిళలు

ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలో అమలు 

మంత్రి జగదీ్‌షరెడ్డి 

సూర్యాపేట(కలెక్టరేట్‌), జనవరి 20 : రాష్ట్రంలో పేదింటి ఆడపడుచుల పెళ్లికి  కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ఆసరాగా నిలిచాయని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన 86 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను గురువారం పంపిణీ చేశారు. కరోనా విజృంభిస్తుండటం, కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి మంత్రి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా అమలులో లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలు లేవన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.  కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, వైస్‌చైర్మన్‌ పుట్టా కిశోర్‌కుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, జడ్పీటీసీ జీడి భిక్షం, కమిషనర్‌ పి.రామాంజులరెడ్డి, తహసీల్దార్‌ వెంకన్న, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులుగౌడ్‌, నాయకులు భాషా, కుంభం రజితారాజేందర్‌, తాహేర్‌పాష, రియాజ్‌, ఆకుల లవకుశ, చిరివెళ్ల లక్ష్మికాంతమ్మ, శబరి, నిమ్మల స్రవంతి, కోడి సైదులుయాదవ్‌, వల్దాసు సౌమ్యజానీ, దేశగాని శ్రీను పాల్గొన్నారు.

లబ్ధిదారుల ఇళ్లకు వద్దకు వెళ్లి చెక్కుల పంపిణీ

సాధారణంగా సంక్షేమ పథకాల చెక్కులను ఏదో ఒక సమావేశంలో ప్రజా ప్రతి నిధులు లబ్ధిదారులకు అందించడం ఆనవాయితీ. అయితే, జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో మంత్రి జగదీ్‌షరెడ్డి గురువారం లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి చెక్కులను అందించారు. పట్టణంలోని 13 వార్డుల్లో మంత్రి కాలినడకన తిరుగుతూ 86 మంది లబ్ధిదారులకు రూ.86లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు మంత్రికి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దారిలో కలిసిన వారితో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2022-01-21T05:58:07+05:30 IST