ఆడపడుచులకు ప్రభుత్వ కానుక కల్యాణ లక్ష్మి

ABN , First Publish Date - 2022-05-26T06:33:34+05:30 IST

ఆడపడుచులకు ప్రభుత్వం కానుకగా కల్యాణ లక్ష్మి పథకం అమలు చేస్తోందని టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువజన నాయ కుడు డా. సంజయ్‌ అన్నారు.

ఆడపడుచులకు ప్రభుత్వ కానుక కల్యాణ లక్ష్మి
లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందిస్తున్న సంజయ్‌

కోరుట్ల, మే 25 : ఆడపడుచులకు ప్రభుత్వం కానుకగా కల్యాణ లక్ష్మి పథకం అమలు చేస్తోందని టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువజన నాయ కుడు డా. సంజయ్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని వివిఽధ వార్డులలో ప్రభుత్వం అందిస్తున్న కల్యాణ లక్ష్మి పథకంలో లబ్ధిదారులు మున్సిపల్‌ చైర్మన్‌ అన్నం లావణ్య - అనిల్‌, వార్డు కౌన్సిలర్లతో కలిసి వారి వారి ఇం డ్ల వద్దకు వెళ్లి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సంజయ్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందేలా పథకా లను రూపొందించి అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల ర్లు జిందం లక్ష్మినారాయణ, గంగాధర్‌, నాగభూషణం, మ్యాడ వేణి నరేష్‌ మాజీ కౌన్సిలర్లు సేనాపతి రాజు నాయకులు ఫహీం, ప్రభు లతో పాటు పలువురు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-26T06:33:34+05:30 IST