ఆడపడుచులకు అండగా ‘కల్యాణలక్ష్మి’

ABN , First Publish Date - 2022-07-07T05:15:27+05:30 IST

పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి పథకం అండగా ఉంటోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

ఆడపడుచులకు అండగా ‘కల్యాణలక్ష్మి’
చెక్కులు అందుకున్న లబ్ధిదారులతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గట్టు, జూలై 6 : పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి పథకం అండగా ఉంటోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 15 లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎంపీడీవో కార్యాలయ సమా వేశ భవనంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమం లో లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం కింద అందించిన డబ్బును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులతో పాటు ఎంపీపీ విజయ్‌, జడ్పీటీసీ సభ్యురాలు శ్యామల, సింగిల్‌విండో చైర్మన్‌ వెంకటేష్‌, తహసీల్దార్‌ సహదేవ్‌, ఎంపీడీవో చెన్నయ్య పాల్గొన్నారు. 


మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి బాధ్యత

మల్దకల్‌ : హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రజాప్రతి నిధులు, గ్రామస్థులకు సూచించారు. మండలంలోని అమరవాయి గ్రామంలో ప్రధాన రహదారికి ఇరు వైపుల మండల ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాటా ్లడుతూ హరితహారంలో భాగంగా అనుకున్న లక్ష్యం మేరకు మొక్కలు నాటాలన్నారు. నాటిన ప్రతీ మొక్క ను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్‌ రామేశ్వరమ్మ, ఎంపీపీ రాజారెడ్డి, వైస్‌ ఎంపీపీ పెద్దవీరన్న, పీఏసీఎస్‌ అధ్యక్షుడు తిమ్మారెడ్డి, సర్పంచు పద్మమ్మ, ఎంపీటీసీ సభ్యుడు గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


దళితుల అభివృద్ధికి పెద్దపీట

మల్దకల్‌ : దళితుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష ్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని అమర వాయి గ్రామంలో దళితబంధు లబ్ధిదారు మహేష్‌ ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన సెంట్రింగ్‌షాపును బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సము చిత న్యాయం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్‌ రామేశ్వరమ్మ, ఎస్సీ కార్పొరే షన్‌ ఈడీ రమేష్‌బాబు, ఎంపీపీ రాజారెడ్డి, వైస్‌ ఎంపీపీ పెద్ద వీరన్న, సర్పంచు పద్మ, ఎంపీటీసీ సభ్యు డు గోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకటన్న, ఎంపీడీవో  కృష్ణయ్య, తహసీల్దార్‌ సరితా రాణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T05:15:27+05:30 IST