Abn logo
Jul 28 2021 @ 06:51AM

విషమంగానే మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ ఆరోగ్యం!

లక్నో: ఉత్తరప్రదేశ్ మూజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. చాలా రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(పీజీఐ) వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం మాజీ సీఎం కల్యాణ్ సింగ్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్‌పై ఉన్నారు. వైద్యులు ఆయనకు తరచూ డయాలసిస్ చేస్తున్నారు. జూలై 4న మాజీ సీఎం కల్యాణ్ సింగ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. కాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పీజీఐకి వచ్చి మాజీ సీఎం కల్యాణ్ సింగ్‌ను పరామర్శించారు.