బాలయ్య బాలయ్య... ఇరగతీసావయ్యా: కల్యాణ్ రామ్

నందమూరి నటసింహం బాలయ్య, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. గురువారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విజయఢంకా మోగిస్తోంది. బాలయ్య అభిమానులే కాక తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం ఈ చిత్ర విజయంతో సంబరాలను జరుపుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన హీరో నందమూరి కల్యాణ్ రామ్.. ట్విట్టర్ వేదికగా ‘బాలయ్య బాలయ్య...ఇరగతీసావయ్యా...’ అంటూ బాలయ్యకు, చిత్రయూనిట్‌‌‌కు అభినందనలు తెలియజేశారు.


‘‘బాలయ్య బాలయ్య...ఇరగతీసావయ్యా... అఖండ సినిమా ఆసాంతం ఎంజాయ్ చేశాను. బాబాయ్ పవరేంటో చూపించాడు. ఇండస్ట్రీకి బ్లాక్‌బస్టర్‌తో ఊపిరిపోసిన చిత్రయూనిట్ మొత్తానికి నా అభినందనలు..’’ అని కల్యాణ్ రామ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 


Advertisement