కల్యాణం.. కమనీయం

ABN , First Publish Date - 2021-04-22T04:52:35+05:30 IST

భక్తజన కోటి ఆరాధ్య దైవమైన సీతారాముల కల్యాణ వేడుకలు జిల్లాలో బుధవారం నిరాడంబరంగా జరిగాయి.

కల్యాణం.. కమనీయం
పెంచికలపేటలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితుడు

- నిరాడంబరంగా సీతారాముల కల్యాణం 

ఆసిఫాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 21: భక్తజన కోటి ఆరాధ్య దైవమైన సీతారాముల కల్యాణ వేడుకలు జిల్లాలో బుధవారం నిరాడంబరంగా జరిగాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో కొద్దిమంది భక్తులను మాత్రమే వేడుకకు అనుమతించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మధ్యాహ్నం 12:03గంటలకు కల్యాణం జరిగింది. జిల్లాకేంద్రమైన ఆసిఫాబాద్‌ పట్టణంలోని జన్కాపూర్‌లో ఉన్న కోదండరామాలయంలో వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండల, గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలను నిర్వహించారు. శ్రీసరస్వతీ శిశుమంది ర్‌లో వేడకను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం లో మాజీఎంపీపీ బాలేశ్వర్‌ గౌడ్‌, బీజేపీనాయకుడు కాండ్రె విశాల్‌,ఆలయకమిటీ సభ్యులుశైలు, రవికాంత్‌, యాదగిరి, గుండా శంకర్‌ పాల్గొన్నారు.

రెబ్బెన: మండలంలో కల్యాణం కొవిడ్‌ నిబంధనల ప్రకారం జరిగింది. కార్యక్ర మంలో సర్పంచ్‌లు అహల్య దేవి, పందిర్ల వినోద మధు నయ్య, చెన్న సోమశేఖర్‌ పాల్గొన్నారు. 

చింతలమానేపల్లి : మండలంలోని కర్జెల్లి హను మాన్‌ ఆలయం, హేటిగూడ అభయాంజనేయ ఆలయంతోపాటు గూడెం, బాబా సాగర్‌ తదితర గ్రామాల్లో నవమి వేడుకలను భక్తులు నిరాడంబరంగా జరిపారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. 

పెంచికలపేట: మండలంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని చెడ్వాయి చీకటయ్య ఆలయంలో, ఎల్కపల్లి రామాలయంలో సీతారాముల కల్యాణం నిర్వహించారు. 

సిర్పూర్‌(టి): మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ రామాలయం, చీలపల్లి గ్రామంలో కొవిడ్‌ నిబంధనల ప్రకారం కల్యాణం జరిపించారు. చీలపల్లిలో సర్పంచ్‌ యాదగిరి బ్రహ్మయ్య, యాదవ సంఘం అధ్యక్షుడు నర్సయ్య, మాజీ సర్పంచ్‌ అర్జు పాల్గొన్నారు. 

దహెగాం: మండలంలోని దహెగాం, లగ్గాం, కొంచవెల్లి, చిన్నరాస్పెల్లి తదితర గ్రామాల్లోని ఆల యాల్లో వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. 

బెజ్జూరు: మండలంలోని ఎల్కపల్లి(బి), చిన్నసిద్దా పూర్‌, మర్తిడి, సలుగుపల్లి, కుకుడ, అంబగట్టు గ్రామాల్లో బుధవారం కల్యాణోత్సవాన్ని ఘనంగా జరిపారు. కార్యక్రమంలో గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేశారు.

లింగాపూర్‌: మండలకేంద్రంతోపాటు పిక్లాతండ, రామునాయక్‌తండ, జాముల్‌ధర, చిన్నదంపూర్‌, లోద్ది గూడ, తదితర గ్రామాల్లో శ్రీరామనవమిని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పిక్లాతండా లింగాపూర్‌, గ్రామాల్లో 21రోజుల నుంచి సేవాలాల్‌ మహరాజ్‌ దీక్షలు తీసుకున్న భక్తులు నేడు విరమంచుకున్నారు.

కౌటాల: మండల కేంద్రంలోని కోదండరామాల యంలో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిం చారు. భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కల్యా ణంలో పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌: పట్టణంలో బుధవారం శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కొవిడ్‌ విస్తరిస్తున్న నేప థ్యంలో ఆలయాల్లో రద్దీ లేకుండా కమిటీ సభ్యులు, హనుమాన్‌ స్వాములు వివిధ రకాలచర్యలు తీసుకు న్నారు. రాంమందిర్‌ ఆలయం, ఈస్‌ఐ ఆస్పత్రి సమీ పంలో, టెంపుల్‌ కాంప్లెక్సు, ఇతర ఆలయాల్లో కల్యా ణాన్ని వేదపండితులు ఘనంగా నిర్వహించారు. హనుమాన్‌ దీక్షాపరులు ఎప్పటికప్పుడు రద్దీ లేకుండా చూశారు. సీఐ మోహన్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

Updated Date - 2021-04-22T04:52:35+05:30 IST