కల్వకుర్తి లిఫ్ట్‌ పాపం ప్రభుత్వానిదే

ABN , First Publish Date - 2020-10-19T09:04:36+05:30 IST

కల్వకుర్తి లిఫ్ట్‌ పంప్‌ మునగడం వెనుక ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తే కారణమని.. కమీషన్లకు ఆశపడి రీ డిజైన్‌ చేయడమే ప్రస్తుత కేఎల్‌ఐ మొదటిపంప్‌ మునక కు కారణమని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచం ద్‌రెడ్డి

కల్వకుర్తి లిఫ్ట్‌ పాపం ప్రభుత్వానిదే

కాసుల కక్కుర్తి కోసమే రీడిజైన్‌

వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి

ఏఐసీసీ కార్యదర్శి చల్లావంశీచంద్‌రెడ్డి


మహబూబ్‌నగర్‌,అక్టోబరు18: కల్వకుర్తి లిఫ్ట్‌ పంప్‌ మునగడం వెనుక ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తే కారణమని.. కమీషన్లకు ఆశపడి రీ డిజైన్‌ చేయడమే ప్రస్తుత కేఎల్‌ఐ మొదటిపంప్‌ మునక కు కారణమని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచం ద్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం మహబూబ్‌నగర్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. ఇరిగేషన్‌ అధికారులంతా భూ గర్భ పంప్‌హౌస్‌ వద్దన్న ప్రభుత్వం కమీషన్ల కోసం డిజైన్‌ మార్చి వెయ్యికోట్ల ప్రజాధనాన్ని దు ర్వినియోగం చేసిందన్నారు. దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవా లని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టర్‌కు ప్రయోజనం చేకూరుస్తూ  కేసీఆర్‌ కుటుంబం రూ.100 కోట్లు, ఆనాటి జిల్లా మంత్రి జూపల్లి రూ.50 కోట్లు ము డుపులు తీసుకుని రీ డిజైన్‌ చేశారని తాను 2017 లోనే చెప్పానన్నారు.


2016 మే 19న ఉపరితల పంప్‌హౌస్‌ నుంచి భూగర్భ పంప్‌హౌస్‌కు మా ర్చాలని కాంట్రాక్టర్‌ కోరితే ఎత్తిపోతల పథకాలకు అడ్వైజర్‌గా ఉన్న పెంటారెడ్డి ఎస్‌ఈకి రాసిన  లేఖలో డిజైన్‌ను మార్చడానికి వీలులేదని  టెండర్‌ డాక్యుమెంట్‌లోనే స్పష్టంగా రాసి ఉన్నదని పాల మూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎస్‌ఈకి రా సిన లేఖలో పేర్కొన్నారని తెలిపారు. ఆ తరువాత 2016 జూలై1న జాయింట్‌ స్టీరింగ్‌ కమిటీ భూగర్భ పంప్‌హౌస్‌ పనులు చేపడితే కల్వకుర్తి మొదటి పంప్‌హౌస్‌కు బీటలువారి నిర్వీర్యం అవుతుందని అంతేకాక రూ.900- 1000కోట్లు అదనపు భారమ వుతుందని రిపోర్ట్‌లో పేర్కొన్నారన్నారు. అయినా ప్రభుత్వం వినకుండా డిపార్ట్‌మెంటల్‌ కమిటీ ద్వారా రీడిజైన్‌కు అనుకూలంగా దొ డ్డిదారిన రిపో ర్ట్‌ తయారు చేయించుని భూగర్భ  పంప్‌హౌస్‌కు అంగీకరించగా తాను ఒప్పుకోనని ఎత్తిపోతల పథ కాల అడ్వైజరీగా ఉన్న పెంటారెడ్డి మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ డీసెంట్‌ ఇచ్చారని,  ఆయన నిజాయి తీకి కాళ్లు కడిగి నెత్తిన పోసుకోవాలన్నారు.


అక్టోబర్‌ 1, 2016న మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ 762 ఎకరాల అటవీ భూమిని సేకరించినట్లు నివేదిక ఇచ్చి అక్టోబర్‌ 28, 2016న 690 ఎకరాల భూమిని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీఈకి ట్రాన్స్‌ఫర్‌ చేస్తే, నవంబర్‌ 18, 2016న ఉపరితల పంప్‌హౌస్‌నుంచి భూగర్భ పంప్‌హౌస్‌కు మారుస్తూ ఉత్తర్వులు ఇస్తూ, ఉపరి తల పంప్‌హౌస్‌ కట్టడానికి ప్రభుత్వం  భూమి ఇ వ్వనందున ఈ నిర్ణయం తీసుకున్నామని కా రణంగా చూపారన్నారు.  ఇందుకు బాధ్యత వ హి స్తూ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు  రాజీనా మా చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు  ఒబేదుల్లాకొత్వాల్‌, నాయకులు హర్షవర్ధన్‌రెడ్డి, వినోద్‌కుమార్‌, ఎన్పీ వెంకటేశ్‌, సీజే  బెనహర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-19T09:04:36+05:30 IST