10 నుంచి కాల్వబుగ్గలో బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-03-05T06:49:00+05:30 IST

మండలంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమష్ట్టి కృషితో విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి అన్నారు.

10 నుంచి కాల్వబుగ్గలో బ్రహ్మోత్సవాలు
ఆహ్వాన పత్రికను విడుదల చేస్తున్న ఎమ్మెల్యే కాటసాని

ఓర్వకల్లు, మార్చి 4: మండలంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమష్ట్టి కృషితో విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఆలయ చైర్మన్‌ గోపా వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహాశివరాత్రి ఆహ్వానపత్రికలు, పోస్టర్లను విడుదల చేశారు. 

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇలా ఉన్నాయి

ఫ ఈ నెల 10వ తేదీ బుధవారం బుగ్గ రామేశ్వరస్వామి కాల్వ గ్రామం నుంచి కాల్వబుగ్గ దేవస్థానం వరకు వరప్రయాణం

ఫ 11 గురువారం మహాశివరాత్రి కుంకురార్పణ, ధ్వజారోహణం, పగలు బుగ్గ రామేశ్వరస్వామి, బ్రమరాంబదేవి పంచామృతాభిషేకం, స్వాముల వారి అభిషేకం, తెల్లవారుజామున 3.25 గంటలకు స్వామి,అమ్మవార్ల కల్యాణోత్సవం.

ఫ 12 శుక్రవారం సింహవాహసన సేవ, ఉదయం 11 గంటలకు నందివాహన సేవ, సాయంకాలం 5 గంటలకు ప్రభోత్సవం

ఫ 13 శనివారం సాయంకాలం 5 గంటలకు రథోత్సవం, 14న ఆదివారం పగలు వసంతోత్సవం, సాయంత్రం పారువేట, 15న సోమవారం బుగ్గ రామేశ్వరస్వామి స్వాముల వారు కాల్వబుగ్గ నుంచి కాల్వ గ్రామానికి తిరుగు ప్రయాణం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్‌ గోప వెంకట రమణారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అధికారులు, కమిటీ సభ్యులు సమష్టి కృషితో విజయవంతం చేయాలన్నారు. భక్తులకు  ఇబ్బంది లేకుండా  మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కల్లె లక్ష్మీనారాయణ శర్మ, కల్లె లక్ష్మీనరసింహ శర్మ, నాయకులు నాగ తిరుపాలు, గుర్రాల చెన్నారెడ్డి, రామేశ్వరరెడ్డి, మోహన్‌ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, భాస్కర్‌, కృష్ణారెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 


12న కబడ్డీ పోటీలు

మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 12న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో పాల్గొను టీమ్‌ సభ్యులు రూ.300 ప్రవేశ రుసుం చెల్లించి రశీదు పొందాలన్నారు. పోటీల్లో గెలుపొందే విజేతలకు మొదటి నుంచి ఐదు బహుమతులు వరుసగా రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.12,006, రూ.10 వేలు, రూ.8016 నగదు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వివరాల కోసం 9704997417, 7702311979 నెంబర్లను సంప్రదించాలన్నారు. 

Updated Date - 2021-03-05T06:49:00+05:30 IST