Abn logo
Apr 8 2021 @ 15:38PM

జగన్‌ అసమర్ధ పాలనకు ఇదే నిదర్శనం: కాలవ శ్రీనివాసులు

అమరావతి: తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోటీలో లేకపోవడంతో ప్రజలకు ఎన్నికల పట్ల ఆసక్తి సన్నగిల్లిందని టీడీపీ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉదయమే ఓట్లు వేయడానికి వస్తారని, మధ్యాహ్నం 12 గంటలు అయినా ఓటర్లు లేక పోలింగ్‌ కేంద్రాలు వెలవెలపోతున్నాయన్నారు. జగన్‌ అసమర్ధ పాలనకు ఇదే నిదర్శనమని అన్నారు. పోలింగ్‌కు ప్రజలు దూరంగా ఉన్నారంటే.. జగన్‌ దుర్మార్గపాలన ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చునన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఎటువైపు ఉన్నారో అర్థం చేసుకోవాలని, ప్రజల హృదయాల్లో తెలుగుదేశం చిరస్ధాయిగా ఉందనేది తెలిసిపోయిందని కాలవ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement
Advertisement