కల్తీ నూనెల జోరు

ABN , First Publish Date - 2022-03-21T05:37:22+05:30 IST

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఇప్పటివరకు వంటనూనెలను బ్లాక్‌ చేసి అధిక ధరలకు విక్రయించడం చూశాం.

కల్తీ నూనెల జోరు

రకరకాల పేర్లతో మార్కెట్‌లో హల్‌చల్‌

రంగుమారి స్పష్టంగా కనిపిస్తున్న తేడా

యుద్ధ నేపధ్యంలో వ్యాపారుల కక్కుర్తి

ఫిర్యాదు చేస్తున్నా పట్టని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు


నెల్లూరు, మార్చి 20(ఆంధ్రజ్యోతి):

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఇప్పటివరకు వంటనూనెలను బ్లాక్‌ చేసి అధిక ధరలకు విక్రయించడం చూశాం. ఇప్పుడు వ్యాపారులు మరో అడుగు ముందుకేసి నూనెలను కల్తీ చేస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్లుగా అందిన కాడికి  ప్రజలను దోచుకునే ప్రయత్నాలు  చేస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న వంటనూనెలను పరిశీలిస్తే తేడా స్ఫష్టంగా కనిపిస్తోంది. రెగ్యులర్‌గా నూనెలను ఉపయోగించే మహి ళలు రంగుమారి తేడాగా ఉన్న వంటనూనెలను చూసి ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌కు డిమాండ్‌ ఏర్పడడంతో ఆ నూనెలో ఎక్కువగా కల్తీ చేస్తున్నారు. సాధారణంగా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లేత పసుపురంగును పోలి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న నూనెలు ఎరుపురంగులో కనిపిస్తున్నాయి. దీన్ని చూస్తే తయారీలో తేడాలు ఉన్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. 


కాసుల కోసం కక్కుర్తి

 కాసుల కక్కుర్తితో వ్యాపారులు కల్తీ చేయడం ప్రజలకు శాపంగా మారింది. ధరలేమో ఓ వైపు పెరుగుతుండగా అందులో నాణ్యత మాత్రం తగ్గుతుండడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. జిల్లాలో ఎక్కువగా ఆయిల్‌ తయారీ కంపెనీలు ఉన్నాయి. వెంకటాచలం, ముత్తుకూరు మండలాల్లో ఎక్కువగా ఎడిబుల్‌  ఆయిల్స్‌ తయార వుతుంటాయి. నెల్లూరులోని స్టౌన్‌హౌస్‌పేటలో కూడా పలువురు వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి ముడిస రుకును తీసుకువచ్చి ఇక్కడ ప్యాకింగ్‌ చేస్తుంటారు. ఇలా ప్యాకింగ్‌ చేసే క్రమంలో ఏ వైతే ప్రభుత్వం సూచించిందో ఆ నిబంధనల మేరకు నూనెల తయారీ జరగాలి. కానీ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌లో వివిధ రకాల నూనెలను కల్తీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వ ల్యాబ్‌ల్లో పరీక్షిస్తే ఏ మేరకు కల్తీ జరిగిందన్నది, ఏయే నూనెలను కల్తీ చేస్తున్నారన్నది స్పష్టమవుతుంది. ఇటీవల ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్‌ అఽథారిటీ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నూనెలను ల్యాబ్‌ల్లో పరీక్షించగా చాలా వరకు కల్తీ అవుతున్నట్లు గుర్తించడం గమనార్హం. 


రకరకాల బ్రాండ్ల పేరుతో..

జిల్లాలో రకరకాల బ్రాండ్ల పేరుతో వంటనూనెలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ బ్రాండ్‌లు దుకాణదారులకు ఎక్కువ మార్జిన్‌లు ఇస్తూ వ్యాపారం పెంచుకునే ధోరణిలో వెళుతున్నాయి. వెంకటాచలం మండలం కాకుటూరు వద్ద ఉన్న ఓ కంపెనీలో తయారైన సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌  తేడాగా ఉండడంతో పలువురు జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు స్పందించలేదన్న ఆరోపణ లు ఉన్నాయి. సాధారణంగా ఫుడ్‌సేఫ్టీ, ఇతర అనుబంధశా ఖల అధికారులు తరచూ నూనెల తయారీ పరిశ్రమలను తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించాల్సి ఉంది. కానీ ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోకపోవడంపై పలు అనుమా నాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే కల్తీ ప్రపంచంతో సతమత మవుతున్న ప్రజలు ఇప్పుడు ఆహార వస్తువులు కూడా  కల్తీ జరుగుతుండడంతో  ఆందోళన చెందుతున్నారు. కల్తీ నూ నెలను ఉపయోగిస్తే దీర్ఘకాలంలో జీర్ణకోశ, గుండె సంబం ధిత వ్యాధులు వచ్చే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Updated Date - 2022-03-21T05:37:22+05:30 IST