కల్కి చెరువులో పడి ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-04-10T05:47:40+05:30 IST

తాగుడుకు బానిసై చెరువులో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు.

కల్కి చెరువులో పడి ఒకరి మృతి

బాన్సువాడ, ఏప్రిల్‌ 9: తాగుడుకు బానిసై చెరువులో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పాత బాన్సువాడకు చెందిన గూడ వెంకట్‌కు 10 సంవత్సరాల క్రితం వివాహ మైంది. ఒక కుమారుడు ఉన్నాడు. నిత్యం తాగి వచ్చి ఇంట్లో భార్యతో గొడ వ పడేవాడు. బుధవారం రాత్రి బయటకు వెళ్లి వస్తానని తిరిగి రాలేదు. చుట్టూ పక్కల వెతికినా ఫలితం లేకపోయింది. శుక్రవారం కల్కి చెరువులో శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. భా ర్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-04-10T05:47:40+05:30 IST