కాళేశ్వరం ప్యాకేజీ-27 పనులు రద్దు

ABN , First Publish Date - 2021-02-25T08:04:32+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించతలపెట్టిన ప్యాకేజీ-27పనులను ప్రభుత్వం రద్దు చేసింది.

కాళేశ్వరం ప్యాకేజీ-27 పనులు రద్దు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించతలపెట్టిన ప్యాకేజీ-27పనులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఎస్సారెస్పీ వెనుక జలాలను ఉపయోగించి ప్రత్యేక లిప్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లక్ష్మీ నరసింహస్వామి పేరిట ఈ లిప్టు ప్రాజెక్టును చేపట్టగా, సుమారు రూ.345.35 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఇప్పటికే సుమారు రూ.12.71కోట్ల పనుల్ని చేశారు. ఈ బిల్లులను చెల్లించి, మిగిలిన పనుల్ని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. 

Updated Date - 2021-02-25T08:04:32+05:30 IST