కాళేశ్వరానికి.. కరెంట్‌ ఖర్చు తగ్గించుకుందాం

ABN , First Publish Date - 2021-10-28T09:17:36+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టుకు కరెంట్‌ ఖర్చును తగ్గించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరం లేకున్నా ఎత్తిపోతల పంపులు...

కాళేశ్వరానికి.. కరెంట్‌ ఖర్చు తగ్గించుకుందాం

ఎత్తిపోతల పథకాల పంపింగ్‌పై నియంత్రణ

 అవసరమైన మేరకే నీటి పంపింగ్‌కు నిర్ణయం

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ల ద్వారా నియంత్రణ

గోదావరి బేసిన్‌లో నాలుగు సెంటర్ల ఏర్పాటు

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుకు కరెంట్‌ ఖర్చును తగ్గించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరం లేకున్నా ఎత్తిపోతల పంపులు నడుపుతుండటం వల్ల కరెంట్‌తోపా టు నీరు కూడా వృధా అవుతోందని భావిస్తోంది. దీం తో ఎత్తిపోతల పథకాల పంపింగ్‌ను నియంత్రించాలని నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్‌తోపాటు గో దావరి బేసిన్‌లో నాలుగు చోట్ల కమాండ్‌ కంట్రోల్‌ సెం టర్లను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌లోని జలసౌధలో ప్రధానమైన లైవ్‌ కమాండ్‌ క ంట్రోల్‌ సెంటర్‌ ఇప్పటికే ఉంది. దీనికితోడు కరీంనగర్‌, గజ్వేల్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల వద్ద సబ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లను పెట్టనున్నాను. ఈ సెంటర్లలోని ప్రత్యేక వ్యవస్థల తో గోదావరిలో ఏ సమయంలో ఎంత ఇన్‌ఫ్లో ఉంది? కాళేశ్వరంతోపాటు ప్రధాన ప్రాజెక్టుల్లో ఎంత మేర నీటి నిల్వలున్నాయి? ఏయే ప్రాంతాల్లో నీటి అవసరాలు ఏ విధంగా ఉన్నాయి? వంటి అంశాలను గుర్తిం చి.. అందుకు అనుగుణంగా ఎత్తిపోతల పథకాల పంపులను నడపనున్నారు. ఈ అంశాలపై బుధవారం  నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఇంజనీరింగ్‌, సాఫ్ట్‌వేర్‌ నిపుణులతో సమావేశమయ్యారు. 


ఈ సమావేశానికి ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లు సి.మురళీధర్‌రావు, నాగేంద్రరావు, హరిరామ్‌, సీఎం ఓ ఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఏజెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు. ఎత్తిపోతల పథకాల పంపులను సమర్థవంతంగా నడిపించడమే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ల ఏర్పాటు లక్ష్యమని ఈ సందర్భం గా రజత్‌కుమార్‌ అన్నారు. గోదావరిలో బ్యాడ్‌ ఇయర్‌ (తక్కువ నీటి లభ్యత కలిగిన సంవత్సరాలు), యావరేజ్‌ ఇయర్‌ (మోస్తరు నీటి లభ్యత కలిగిన సంవత్సరాలు), గుడ్‌ ఇయర్‌ (సమృద్ధి నీటి లభ్య త కలిగిన సంవత్సరాలు)ల మూడు కా లాల్లో నీటి పంపింగ్‌ ఏ విధంగా ఉండాలన్నదాని ఆధారంగా ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు పనిచేయనున్నాయి. సాధారణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి వాతావరణ సూచనలు అందుతుంటాయి. ఏ సమయంలో ఏ మేర వర్షపాతం కురుస్తుందన్నది ఈ సూచనల ద్వారా తెలుస్తుంది. దీని ఆధారంగానే కమాండ్‌ కంట్రోల్‌ పనిచేస్తుంది. 


హైదరాబాద్‌ నుంచే పంపుల నిర్వహణ..

హైదరాబాద్‌లో ఉన్న లైవ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెం టర్‌ నుంచే భవిష్యత్తులో కాళేశ్వరంలోని ప్రాజెక్టుల పంపులు ఆపరేట్‌ కానున్నాయి. మిగిలిన మూడు క మాండ్‌ కంట్రోల్‌ సెంటర్లను దీనితో  అనుసంధానం చేస్తారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు త్వర లో నివేదిక అందించాక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ల కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. సాధారణంగా గోదావరికి ఏటా జూన్‌లో వరదలు వ స్తే.. పంపింగ్‌ జూన్‌ నెలాఖరు నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబరులో వరదలు తగ్గుముఖం పట్టేదాకా పంపులు పనిచేస్తాయి. ఏటా 120 రోజులపాటు పం పింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. రోజుకు 2 టీఎంసీల వరద జలాలను తరలించడానికి వీలుగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించగా... అదనంగా మరో టీఎంసీ ప నులు కూడా పూర్తికావస్తున్నాయి. మూడో టీఎంసీ  అందుబాటులోకి వస్తే పంపుల సామర్థ్యం 7152 మెగావాట్లకు చేరి కరెంట్‌ భారం పెరుగుతుంది. 



కరెంట్‌ చార్జీలకే రూ.5 వేల కోట్లు

ప్రస్తుతం ఎత్తిపోతల పంపింగ్‌కుగాను ప్రభుత్వం ఏటా రూ.5 వేల కోట్లను గంపగుత్తగా విద్యుత్‌ సంస్థలకు చెల్లిస్తోంది. వాస్తవానికి ఏటా రూ. 7500 కోట్ల దాకా పంపుల కరెంట్‌కు అవుతుందని లెక్కలు చెబుతున్నాయి. యూనిట్‌కు రూ.5.80 చొప్పున విద్యుత్‌ సంస్థలు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ చార్జీలను రూ.3.50కు కుదించాలని ప్ర భుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మం డలి(టీఎ్‌సఈఆర్‌సీ)కి నివేదించుకుంది. కానీ, ఈ విజ్ఞప్తిని ఈఆర్‌సీ తోసిపుచ్చింది. రాష్ట్రంలో కృష్ణా, గోదావరిపై ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తిస్థాయిలో నడిస్తే ఏటా 37 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వీటికే అవసరమవుతుంది. అప్పుడు డిమాండ్‌ చార్జీ లు, కరెంట్‌ చార్జీలు కలుపుకొని రూ. 30 వేల కోట్ల దాకా అవుతుంది. అయితే ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ విధానం అమలు చేయాలని నిర్ణయించడంతో నీటి వినియోగం తగ్గనుంది. దాంతో పంపులను అవసరమైనప్పుడే వినియోగించాల్సి ఉంటుంది. కరెంట్‌ చార్జీలను, మరోవైపు నీటి వృధాను అరికట్టే వీలుంటుంది. ఈ దిశగానే ప్రభుత్వం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ విధానాన్ని అమలు చేయనుంది. 

Updated Date - 2021-10-28T09:17:36+05:30 IST