ప్రాణహిత నిర్మాణం జరిగేనా?

ABN , First Publish Date - 2020-07-11T09:31:40+05:30 IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు వరప్రదాయినిగా భా వించే ప్రాణహిత ప్రాజెక్టుపై బ్యారేజీ నిర్మాణం నిలిచి పోయింది.

ప్రాణహిత నిర్మాణం జరిగేనా?

డిజైన్‌ మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా నిర్మాణం

అర్ధంతరంగా నిలిచిపోయిన పనులు

నష్టపోతున్న రెండు జిల్లాల రైతులు

పట్టించుకోని అధికార పార్టీ నాయకులు


(ఆంధ్రజ్యోతి, మంచిర్యాల)  

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు వరప్రదాయినిగా భా వించే ప్రాణహిత ప్రాజెక్టుపై బ్యారేజీ నిర్మాణం నిలిచి పోయింది. నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ ప్రాణహిత- చేవెళ్ళ సుజల స్రవంతి స్థానంలో డిజైన్‌ను మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ఈ మార్పు వల్ల కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో  2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని, అలాగే కరీంనగర్‌, వరం గల్‌, నిజామాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాలకు 160 టీఎంసీల నీటిని కుమ్రంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద నుంచి తీసుకొని 16.40 లక్షల ఎకరాలకు, సిర్పూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్‌, ఆసిఫాబాద్‌ నియోజక వర్గాలకు నీరందించే ప్రణాళిక రూపొందించారు. ఇందుకు సంబం ధించి పలు చోట్ల కాల్వల నిర్మాణాలు కూడా జరిగాయి.


రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహెట్టి నుంచి బ్యారేజీ నిర్మా ణాన్ని రీ డిజైన్‌ చేసి కాళేశ్వరానికి మార్చింది. దీంతో ఇక్కడ ప్రాజెక్టులు పనులు ఎక్కడికక్కడ నిలిచిపో యాయి. కాల్వల నిర్మాణాలు  ఆగిపోయాయి.  కాల్వల నిర్మా ణాలు పూర్తికావడంతో ప్రాణహిత, పెన్‌గం గా,  వార్దాలపై బ్యారేజీలు నిర్మిస్తారని, సర్వే జరుగుతోందని నాయకులు పేర్కొన్నారు. అయితే అవేవీ జరగలేదు. ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. రైతులందరు కేవలం ఆరు తడి పంటలకే పరిమితమయ్యారు. దీంతో ఈ  ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. బెల్లంపల్లి  నియోజ కవర్గంలో పెద్ద ప్రాజెక్టులేవీ లేవు.  చెన్నూర్‌లో ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మూడు లిఫ్టులతో చెన్నూర్‌ నియోజకవర్గానికి లక్షా 35 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రణాళికలను రూపొందించి సర్వే చేయిస్తున్నారు. ఉమ్మడి జిల్లా రైతుల కోసం ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.   


ప్రాణహిత నిర్మించాలంటున్న రైతులు

ప్రాణహిత నీరు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు ఎప్పు డు అందిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిఽధులు ఈ విషయంపై ఎందుకు మాట్లాడ టం లేదు. మెదక్‌ జిల్లాను సస్యశ్యామలం చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను ఎడారి చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా 2016 మే 2న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం చేసి జిల్లాకు నీరు ఇస్తామన్నారు. ప్రాణహిత చేవెళ్ళను రీడిజైన్‌ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు  వద్ద మేడిగడ్డ బ్యారేజీ నిర్మించి తెలంగాణ జిల్లాలకు నీరందిస్తామన్నారు. నాలుగు సంవత్సరాలైంది. ప్రాణహిత నీరు తెలంగాణ లోని ఇతర జిల్లాలకు తరలించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సంగతేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.  

Updated Date - 2020-07-11T09:31:40+05:30 IST