Abn logo
Sep 28 2021 @ 12:14PM

జగన్ ప్రభుత్వంలో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు: కాల్వ శ్రీనివాసులు

అమరావతి: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. వేరుశెనగ రైతులకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పంట దెబ్బతిన్న రైతులను కనీసం స్థానిక నేతలు కూడా పరామర్శించలేదని మండిపడ్డారు. రైతులు వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మలేని స్థితిలో ఉన్నారన్నారు. టీడీపీ హయాంలో రైతన్నలను ఆదుకున్నామని చెప్పారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కాల్వ శ్రీనివాసులు కోరారు.

ఇవి కూడా చదవండిImage Caption