బొత్సా.. ఇది తగునా?

ABN , First Publish Date - 2020-11-25T06:48:46+05:30 IST

టీడీపీ హయాంలో చేపట్టిన పథకాలకే ఇప్పుడు మళ్లీ ఆర్భాటంగా శంకుస్థాపనలు చేయ టం తగునా అంటూ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యు డు కాలవ శ్రీనివాసులు.. మంత్రి బొత్స సత్యనారాయణను ప్రశ్నించారు.

బొత్సా.. ఇది తగునా?
మాట్లాడుతున్న కాలవ శ్రీనివాసులు

టీడీపీ హయాంలోనే ఆస్పత్రుల సామర్థ్యాల పెంపు

వాటికే శంకుస్థాపనలా..

మాజీ మంత్రి కాలవ ధ్వజం

అనంతపురం వైద్యం నవంబరు24: టీడీపీ హయాంలో చేపట్టిన పథకాలకే ఇప్పుడు మళ్లీ ఆర్భాటంగా శంకుస్థాపనలు చేయ టం తగునా అంటూ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యు డు కాలవ శ్రీనివాసులు.. మంత్రి బొత్స సత్యనారాయణను ప్రశ్నించారు. ఆయన మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. టీడీపీ హయాంలో మంజూరు చేసి, ప్రారంభించిన అభివృద్ధి పథకాలకు ఇప్పుడు మళ్లీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2019 ఫిబ్రవరి 15న రాష్ట్రంలో 31 ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యాన్ని పెంచుతూ జీఓ విడుదల చేశామన్నారు. అందుకు నాబార్డ్‌ కింద రూ.250 కోట్లు మంజూరు చేశామన్నారు. ఆ ఆసుపత్రుల అభివృద్ధి పనులకు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభోత్సవాలు చేశారన్నారు. అందులో రాయదుర్గం ఆసుపత్రి ఉందన్నారు. ఇప్పుడు అదే ఆసుపత్రి సామర్థ్యం పెంచామని గొప్పలు చెప్పి, రెండోసారి అదీ మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకర్‌నారాయణ చేతుల మీదుగా శంకుస్థాపన చేయటం సిగ్గుచేటన్నారు. రెండోసారి ప్రారంభోత్సవాలు చేయటం మోసం కాదా అని ప్రశ్నించారు. ఆ పనులు టీడీపీవి కాదని ధైర్యంగా చెప్పగలరా అని సవా ల్‌ విసిరారు. పథకాలను రద్దు చేస్తామని జనాలను భ యపెట్టి, సమావేశానికి తీసుకెళ్లారన్నారు. అద్దె జనాలు, అసత్య ప్రచారం తప్పా ఏమీ లేదన్నారు. వైసీపీ మోసాలు ప్రజలకు తెలిసిపోయాయనీ, తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Updated Date - 2020-11-25T06:48:46+05:30 IST