‘కళాసాగర్‌’ సుభాన్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2021-06-23T10:00:07+05:30 IST

మూడు దశాబ్దాల పాటు చెన్నై నుంచి తెలుగు సంస్కృతీ సౌరభాలను వెదజల్లి, విమర్శకుల నుంచి సైతం శభాష్‌ అనిపించుకున్న ‘కళా సాగర్‌’ సంస్థ వ్యవస్థాపకుడు ఎం.సుభాన్‌ (90) అనారోగ్యంతో మంగళవారం

‘కళాసాగర్‌’ సుభాన్‌ కన్నుమూత

తమిళ గడ్డపై విరబూసిన తెలుగు సాహితీ సౌరభం!


చెన్నై, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): మూడు దశాబ్దాల పాటు చెన్నై నుంచి తెలుగు సంస్కృతీ సౌరభాలను వెదజల్లి, విమర్శకుల నుంచి సైతం శభాష్‌ అనిపించుకున్న ‘కళా సాగర్‌’ సంస్థ వ్యవస్థాపకుడు ఎం.సుభాన్‌ (90) అనారోగ్యంతో మంగళవారం వేకువజామున స్థానిక విల్లివాక్కంలోని స్వగృహంలో కన్నుమూశారు. సాయంత్రమే ఆయన అంత్యక్రిమలు ముగిశాయి. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా క్రొవ్విడి. సుభాన్‌కు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. తమిళగడ్డపై తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను, తెలుగు సాహితీ సౌరభాన్ని విరబూయించాలన్న సుభాన్‌ లక్ష్యంతో రూపుదిద్దుకున్న సంస్థే కళాసాగర్‌. ఆ సంస్థ పేరిట ఇచ్చే అవార్డును కళాకారులు అప్పట్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించేవారు. రైల్వే ఇంటెగ్రెల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎ్‌ఫ)లో సాధారణ ఉద్యోగిగా చేరిన సుభాన్‌.. నాటి సీనియర్‌ నటీమణి భానుమతి సూచనతో ఏర్పాటు చేసిన కళాసాగర్‌ సంస్థ అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా 1972 జూన్‌లో ప్రారంభమైంది. 

Updated Date - 2021-06-23T10:00:07+05:30 IST