కాంపల్లి బాలుకు కళారత్న అవార్డు

ABN , First Publish Date - 2021-01-25T04:27:45+05:30 IST

ఓ గల్ఫ్‌ మహిళ కన్నీటి గాథ వీడియో సాంగ్‌ను రూపొందించిన తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ కళాకారుడు కాంపల్లి బాలకృష్ణ(బాలు)కు కళారత్న అవార్డు దక్కింది.

కాంపల్లి బాలుకు కళారత్న అవార్డు
బాలుకు అవార్డు బహుకరిస్తున్న రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి

తల్లాడ, జనవరి 24: ఓ గల్ఫ్‌ మహిళ కన్నీటి గాథ వీడియో సాంగ్‌ను రూపొందించిన తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ కళాకారుడు కాంపల్లి బాలకృష్ణ(బాలు)కు కళారత్న అవార్డు దక్కింది. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శ్రీసాయి అలేఖ్య సాంస్కృతిక సేవాసంస్థ ఆధ్వర్యంలో కళారత్న అవార్డును బాలుకు రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి చేతులమీదుగా ప్రధానం చేశారు. య్యూట్యూబ్‌లో ప్రేక్షకుల ఆదరణ పొందిన కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో గల్ప్‌ దేశాలకు వెళ్లి ఉపాధి పొందుతున్న మహిళల కన్నీటి గాథను బాలు వీడియో పాట ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించటం జరిగింది. ఇందుకుగానూ సాంస్కృతిక సేవాసంస్థ చైర్మన్‌ అరుణ ఉపదృష్ట బాలును అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతి సుభా్‌షరెడ్డి, కార్పొరేటర్‌ మాధవరం రోజాదేవి, గీత ప్రవీణ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-01-25T04:27:45+05:30 IST