కల్లాలతో రైతులకు ఎంతో ఉపయోగం

ABN , First Publish Date - 2020-12-05T03:58:46+05:30 IST

కల్లాల నిర్మాణంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఎంపీపీ గుర్రం మంగశ్రీనివాస్‌గౌడ్‌, జడ్పీటీసీ వేల్పుల రవి, మండల ప్రత్యేకాధికారి సత్యనారాయణరెడ్డిలు అన్నారు.

కల్లాలతో రైతులకు ఎంతో ఉపయోగం
కల్లెం నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఎంపీపీ గుర్రం మంగశ్రీనివాస్‌గౌడ్‌

మందమర్రిరూరల్‌, డిసెంబరు 4 : కల్లాల నిర్మాణంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఎంపీపీ గుర్రం మంగశ్రీనివాస్‌గౌడ్‌, జడ్పీటీసీ వేల్పుల రవి, మండల ప్రత్యేకాధికారి సత్యనారాయణరెడ్డిలు అన్నారు. శుక్రవారం మామిడిగట్టు గ్రామపంచాయతీలో సర్పంచు కోట రాయలింగు వరి పొలంలో కల్లాల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. వారు మాట్లాడుతూ  కల్లాలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయని, సరైన తేమ వచ్చే వరకు ధాన్యాన్ని ఆరబెట్టుకోవచ్చని తెలిపారు. మండల వ్యాప్తంగా 44 కల్లాల నిర్మాణాలు మంజూరయ్యాయని, వాటి  పనులను ప్రారంభించి త్వరగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీ శాతం రైతులకు వంద శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 90 శాతం సబ్సిడీపై  కల్లాలను నిర్మించడం జరుగుతుందన్నారు. ఈనెల 15లోగా కల్లాల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఎంపీవో షేక్‌ సప్దర్‌ ఆలీ, ఏపీవో రజియా సుల్తానా, శ్రీనివాస్‌గౌడ్‌, కార్యదర్శులు,ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-05T03:58:46+05:30 IST