బీజేపీలో చేరికపై కళా వెంకట్రావు స్పందన

ABN , First Publish Date - 2021-01-15T20:24:05+05:30 IST

బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు ఖండించారు

బీజేపీలో చేరికపై కళా వెంకట్రావు స్పందన

అమరావతి: బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు ఖండించారు. పార్టీ మార్పు వార్తల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన ఇంటికి వస్తున్న విషయం కూడా తెలియదని స్పష్టం చేశారు. చివరి వరకు చంద్రబాబుతోనే ఉంటానని ప్రకటించారు. అయినా పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని కళా వెంకట్రావు వెల్లడించారు.

Updated Date - 2021-01-15T20:24:05+05:30 IST