కోర్టులు, చట్టాలపై వైసీపీకి గౌరవం లేదు: కళా వెంకట్రావు

ABN , First Publish Date - 2022-03-06T19:55:36+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని కళా వెంకట్రావు స్పష్టం చేశారు.

కోర్టులు, చట్టాలపై వైసీపీకి గౌరవం లేదు: కళా వెంకట్రావు

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోర్టులు, చట్టాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదని విమర్శించారు. రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా పోలవరం పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయని కళా వెంకట్రావు ఆరోపించారు.

Updated Date - 2022-03-06T19:55:36+05:30 IST