సాధారణంగా ప్రేక్షకులకు హీరో పాత్రే నచ్చుతుంది. కానీ కొన్ని సినిమాల్లో మాత్రమే విలన్ పాత్ర డిఫరెంట్‌గా ఉండి ఆకట్టుకుంటుంది. అలా డిఫరెంట్ విలనిజంతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు సంజయ్ దత్. ఈయన జాకీష్రాఫ్, మాధురి దీక్షిత్ కలిసి నటించిన చిత్రం 'ఖల్ నాయక్'. సుభాష్ ఘాయ్ తెరకెక్కించిన ఈ చిత్రం 1993లో విడుదలైంది. 27 ఏళ్లు తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుంది. ఈ సీక్వెల్లో సంజయ్‌దత్ పాత్రను టైగర్‌ష్రాఫ్ చేయబోతున్నాడట. మరి జాకీ ష్రాఫ్ పాత్రలో.. మాధురి దీక్షిత్ పాత్రల్లో ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ సీక్వెల్లో సంజయ్‌దత్, మాధురి దీక్షిత్ కూడా నటించబోతున్నారట. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో 'ఖల్నాయక్' సినిమాను రూపొందించిన సుభాష్ ఘాయ్ సీక్వెల్‌ను డ్రగ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్నారట.