రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

ABN , First Publish Date - 2021-12-02T05:36:05+05:30 IST

సామర్లకోట, డిసెంబరు 1: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రంగు మారిన, మొలకెత్తిన ధాన్నాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ వెల్లడించారు. సామర్లకోట మండలం వేట్లపాలెం, అచ్చంపేట గ్రామాల్లో రైతు

రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
సామర్లకోట మండలం వేట్లపాలెంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో

కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ 

సామర్లకోట, డిసెంబరు 1: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రంగు మారిన, మొలకెత్తిన ధాన్నాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ వెల్లడించారు. సామర్లకోట మండలం వేట్లపాలెం, అచ్చంపేట గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల నుంచి ప్రభుత్వం చేస్తున్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఆయన బుధవారం పరిశీలించారు. వేట్లపాలెం ఆదిలక్ష్మి రైస్‌మిల్లు ఆవరణలో ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం రాశులను పరిశీలించి రికార్డులు తనిఖీలు చేశారు. అంతకుముందు వేట్లపాలెం రైతు భరోసా కేంద్రాల్లోని ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అమలు చేస్తున్న వివిధ రికార్డులను ఆర్డీవో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్టర్ల నిర్వహణ, తేమశాతం పరిశీలన వంటి అంశాలపై తహశీల్దార్‌ జితేంద్ర, ఎంఏవో సత్యలకు సూచనలు చేశారు. అచ్చంపేటలోని రైతు భరోసా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు అంశాలను పరిశీలించారు. సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-02T05:36:05+05:30 IST