అట్రాసిటీ, మహిళా పెండింగ్‌ కేసులను పరిష్కరించాలి: ఎస్పీ

ABN , First Publish Date - 2022-06-30T05:42:08+05:30 IST

కాకినాడ క్రైం, జూన్‌ 29: పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, మహిళలకు చెందిన కేసులు, పోస్కో కేసులను సత్వరంగా విచారణ పూర్తి చేసి పరిష్కరించాలని ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో బుధవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిస్సింగ్‌ కేసులపై దృష్టిసారించి త్వరితగతిన విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాల

అట్రాసిటీ, మహిళా పెండింగ్‌ కేసులను పరిష్కరించాలి: ఎస్పీ
సమీక్షలో ఎస్పీ

కాకినాడ క్రైం, జూన్‌ 29: పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, మహిళలకు చెందిన కేసులు, పోస్కో కేసులను సత్వరంగా విచారణ పూర్తి చేసి పరిష్కరించాలని ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో బుధవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిస్సింగ్‌ కేసులపై దృష్టిసారించి త్వరితగతిన విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి మంగళ, బుధ, శనివారాల్లో నో యాక్సిడెంట్‌ డే డ్రైవ్‌ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. క్రైం, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసుల సమన్వయంతో చోరీలు, చైన్‌ స్నాచింగ్‌లు జరక్కు ండా కృషి చేయాలన్నారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌, మత్తు, మాదకద్రవ్యాల నివారణ, దిశ యాప్‌లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జాతీయ మెగా లోక్‌ అధాలత్‌లో అత్యధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషిచేసిన ట్రాఫిక్‌ డీఎస్పీ పడాల మురళీకృష్ణారెడ్డి, ట్రాఫిక్‌ సీఐ డీఎస్‌ చైతన్యకృష్ణ, టూటౌన్‌ సీఐ రామచంద్రరావు, వన్‌టౌన్‌ సీఐ నక్కా రజనీకుమార్‌, పలువురు ఎస్‌ఐలకు నగదు రివార్డులు, ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. సమీక్షలో ఏఎస్పీ ఏఆర్‌ బి.సత్యనారాయణ, ఎస్‌బీ డీఎస్పీలు ఎం.అంబికాప్రసాద్‌, ఎస్‌డీపీవో భీమారావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T05:42:08+05:30 IST