Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం

సర్పవరం జంక్షన్‌, నవంబరు 30: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా అండగా నిలుస్తామని కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి తెలిపారు. నేమాం శివారు గుత్తులవారిపాలెంలో నాయకులతో కలసి మీ ఆడపడుచుగా మీఇంటికి కార్యక్రమంలో భాగంగా  కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జనవరిలోపు 7 వేలమంది పార్టీ కుటుంబ సభ్యులను కలుసుకుంటామన్నారు. మహిళ కార్యకర్తలకు కరపత్రాలు అందజేశారు. డాక్టర్‌ చప్పిడి వెంకటేశ్వరరావు, గుబ్బల శివ, జి.సత్తిబాబు, బావిశెట్టి శ్రీను, వెంకటేశ్వరావు, సూరంపూడి రాజు, కొప్పిశెట్టి గణరాజు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement