Advertisement
Advertisement
Abn logo
Advertisement

గృహ నిర్మాణాలు చేపట్టేలా చైతన్యపరచాలి

కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ 

కరప, అక్టోబరు 22: పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులతో గృహ నిర్మాణాలను చేపట్టేలా చైతన్యపరచాలని కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ అధికారులకు సూచించారు. స్థానిక మండ లపరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన మండలస్థాయి అధికారులతో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోర్టు తీర్పు వెలువడిన వెంటనే వారంతా మూకుమ్మడిగా ఇళ్ల నిర్మాణాలను ఆరంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సచివాలయాన్ని సందర్శించి జగనన్న శాశ్వత గృహహక్కు పథకం లబ్ధిదారుల డేటా ఎంట్రీ పక్రియను ఆయన పరిశీలించారు. తహశీల్దార్‌ పొన్నమండ శ్రీనివాసరావు, ఎంపీడీవో కర్రె స్వప్న, హౌసింగ్‌ డీఈ గుప్తా, ఏఈ సోమిరెడ్డి, ఆర్‌ఐ పేపకాయల మాచరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement