Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పెళ్లికాని అబ్బాయిలకు ఎర

twitter-iconwatsapp-iconfb-icon
పెళ్లికాని అబ్బాయిలకు ఎర

  • మాట్రిమోని సైట్‌లో అమ్మాయి ఫేక్‌ ఐడీతో ఘరానా మోసం
  • మ్యాజిక్‌ యాప్‌ ద్వారా ఆడగొంతుతో మోసాలు
  • కాకినాడకు చెందిన మోసగాడి అరెస్టు
  • రూ.14 లక్షలు స్వాధీనం
  • వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఇన్‌చార్జి డీసీపీ


జ్యోతినగర్‌, జూలై 4: పెళ్లికాని అబ్బాయిలను ఎంచుకుని, అమ్మాయి ఫొటోతో ఫేక్‌ ప్రొఫైల్‌ సృష్టించి పలువురు యువ కులను మోసం చేసిన ఘరానా మోసగాడు కోమలి సూర్య ప్రకాష్‌(30)ను సోమవారం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీసులు అరెస్టు చేశారు. ఎన్టీపీసీ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి ఇన్‌చార్జి డీసీపీ అఖిల్‌ మహాజన్‌ వివరాలు వెల్లడించారు. కాకినాడ రూరల్‌ సూర్యారావుపేటకు చెందిన కోమలి సూర్య ప్రకాష్‌ జూదం(గ్యాబ్లింగ్‌), జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలో మకాన్ని హైదరాబాద్‌కు మార్చాడు. మాట్రి మోనీ ద్వారా పరిచయమైన అల్వాల్‌(హైదరాబాద్‌)కు చెం దిన ఒక అమ్మాయితో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. ఆ అమ్మా యి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సూర్యప్రకాష్‌పై రాం గోపాల్‌పేట్‌లో కేసు నమోదై జైలుకు వెళ్లి వచ్చాడు. 


తప్పుడు ఐడీ సృష్టించి మోసాలు

ఆ తర్వాత కొన్నాళ్లకు మాట్రిమోనీలో తప్పుడు ఐడీ సృష్టించి అమాయకపు యువకులను మోసం చేయాలని పథకం వేశాడు. తెలుగు మాట్రిమోని డాట్‌కాంలో దివ్యశ్రీ పేరుతో ఒక అమ్మాయి ఫొటోతో ఫేక్‌ ప్రొఫైల్‌(ఐడీ) క్రియే ట్‌ చేశాడు. వాట్సాప్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేశాడు. మ్యాజిక్‌ కాల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేశాడు. ఈ ప్రొఫైల్‌కు ఎన్టీపీసీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన మూ డెత్తుల సురేష్‌ అనే యువకుడు పెళ్లి కోసం రిక్వెస్ట్‌ పెట్టా డు. ఈ రిక్వెస్ట్‌ను దివ్యశ్రీ పేరుతో ఉన్న సూర్యప్రకాష్‌ ఓకే చెప్పాడు. తరువాత మ్యాజిక్‌ కాల్‌ యాప్‌లో ఆడగొంతుతో సురేష్‌తో మాట్లాడడమే కాకుండా వాట్సప్‌లో తరుచూ సూర్యప్రకాష్‌ చాటింగ్‌ చేశాడు. ఒకరోజు తన తండ్రికి ఆరో గ్యం బాగా లేదని, ట్రీట్‌వెంట్‌కు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతాయని సూర్యప్రకాష్‌ ఫోన్‌ చేశాడు. పొలం అమ్మిన తరువాత డబ్బు ఇస్తానని డబ్బు ఇవ్వమని కోరాడు. ఇది నమ్మిన సురేష్‌ రెండు విడతల్లో రూ.8లక్షలు సూర్య ప్రకాష్‌ ఇచ్చిన అకౌంట్లో జమ చేశాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు సురేష్‌ తన డబ్బు తిరిగి ఇవ్వమని సూర్యప్రకాష్‌ పై ఒత్తిడి చేసినా దాట వేస్తూ వచ్చాడు. అనుమానం వచ్చి న సురేష్‌ గత నెల ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎన్టీపీసీ పోలీసులు సాంకేతిక ఆధారా లు, కాల్‌ డేటా తదితర ఆధారాలతో లోతుగా దర్యాప్తు చేసి అమ్మాయి పేరుతో సూర్యప్రకాష్‌ మోసం చేశాడని గుర్తించి అతడికోసం గాలించారు. ఈ నేపథ్యంలో మరోసారి సూర్య ప్రకాష్‌ ఆడగొంతుతో సురేష్‌కు ఫోన్‌ చేసి మరో రూ.2లక్షలు కావాలని కోరాడు. తన బాబాయ్‌ను ఎన్టీపీసీకి పంపిస్తున్నా నని, రూ.2లక్షలు ఇవ్వాలని చెప్పాడు. విషయం తెలుసుకు న్న ఎన్టీపీసీ పోలీసులు గౌతమినగర్‌కు వచ్చిన వ్యక్తిని అదు పులోకి తీసుకున్నారు. తర్వాత అదుపులో ఉన్న వ్యక్తి సూర్య ప్రకాష్‌గా గుర్తించి అరెస్టు చేసినట్లు డీసీపీ అఖిల్‌ మహా జన్‌ తెలిపారు. నిందితుడు సూర్యప్రకాష్‌ ఒడిశా పరిధిలో ఆర్మీలో పనిచేస్తున్న కుమార్‌ను, బెంగళూరు, నెల్లూరుకు చెందిన యువకులను మోసం చేసినట్లు నిర్ధారణ అయింద ని ఆయన చెప్పారు. ఈ నలుగురు నుంచి రూ.18లక్షల సూ ర్యప్రకాష్‌ వసూలు చేసినట్లు తెలిపారు. అతడి ఫోన్‌ డేటా ఆధారంగా సూర్యప్రకాష్‌ దేశవ్యాప్తంగా మాట్రిమోని ద్వారా తెలిసిన 25మందితో మ్యాజిక్‌ యాప్‌ ద్వారా ఆడగొంతతో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు తేలిందని డీసీపీ మహాజన్‌ అ న్నారు. అతడినుంచి నుంచి  రూ.14 లక్షలు, 18 సిమ్‌కార్డు లు, సెల్‌ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు. బాధితులకు సంబంధించిన ఆయా పోలీస్‌స్టేషన్లకు సూర్యప్రకాష్‌ వివరా లను తెలియజేస్తున్నామన్నారు. నింతుడిని పట్టుకోవడంలో సమర్థవంతంగా పని చేసిన సీఐ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐలు జీవన్‌, సాగర్‌, పీసీలు అజయ్‌, ఆంజనేయులను డీసీపీ అభినందించి రివార్డులు అందజేశారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.