బౌద్ధస్థూపాల విశిష్టతను చాటి చెబుదాం

ABN , First Publish Date - 2022-05-26T05:51:09+05:30 IST

గొల్లప్రోలు రూరల్‌, మే 25: ప్రాచీనమైన బౌద్దస్థూపాలు, ఆరామాల విశిష్టతను అందరికి చాటిచెబుదామని కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌ సూచించారు. గొల్లప్రోలు మండలం కొడవలిలో క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటి కొడవలి దాతు గర్భ బౌద్ధ మహాస్థూపం విశిష్టతను దేశమంతా

బౌద్ధస్థూపాల విశిష్టతను చాటి చెబుదాం
కొడవలిలో పోస్టల్‌ కవర్‌ను ఆవిష్కరిస్తున్న ఎంపీ

కాకినాడ ఎంపీ గీత

గొల్లప్రోలు రూరల్‌, మే 25: ప్రాచీనమైన బౌద్దస్థూపాలు, ఆరామాల విశిష్టతను అందరికి చాటిచెబుదామని కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌ సూచించారు. గొల్లప్రోలు మండలం కొడవలిలో క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటి కొడవలి దాతు గర్భ బౌద్ధ మహాస్థూపం విశిష్టతను దేశమంతా తెలియజెప్పేందుకు భారతీయ తపాలశాఖ రూపొందించిన పోస్టల్‌ కవర్‌(తపాల చంద్రిక)ను విశాఖ రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ముత్యాల వెంకటేశ్వర్లుతో కలిసి బుధవారం ఆమె ఆవిష్కరించా రు. పురాతన, చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్య త అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో బౌద్ద దమ్మ పీఠం వ్యవస్థాపకుడు భంతేజీ ఆంధ్రా అనాలయో, కాకినాడ, అనకాపల్లి సర్కిల్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌లు డి.నాగేశ్వరరెడ్డి, జె.ప్ర సాదరావు, సర్కిల్‌ సెక్రటరీ నాగేంద్రకుమార్‌, గ్రామ సర్పంచ్‌ బుర్రా నాగరామచంద్ర, ఎంపీటీసీ బద్దా భగవాన్‌, మహాస్థూపం పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు పెయ్యల పావనప్రసాద్‌ ఉన్నారు.


Updated Date - 2022-05-26T05:51:09+05:30 IST