ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్

ABN , First Publish Date - 2022-05-26T00:29:58+05:30 IST

ఎమ్మెల్సీ అనంతబాబును వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తాజాగా...

ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్

Amaravati: ఎమ్మెల్సీ అనంతబాబు (Mlc Ananthababu)ను వైసీపీ (Ycp) అధిష్టానం సస్పెండ్ చేసింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ (Suspend) చేస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకు మేజిస్ట్రేట్ (magistrate) 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.


మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఈ నెల 19న హత్యకు గురయ్యారు. అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి కాకినాడలో ఆయన ఇంటికి సమీపంలో  వదిలి వెళ్లారు. దీంతో ఎమ్మల్సీ అనంతబాబుపై ఆరోపణలు వచ్చాయి. అనంతబాబే హత్య చేశాడని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ప్రాథమిక విచారణలో అనంతబాబు హత్య చేసినట్లు గుర్తించారు. అంతేకాదు అనంతబాబు కూడా సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దాంతో అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. కేసు విచారించిన మేజిస్ట్రేట్ అనంతబాబుకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 



Updated Date - 2022-05-26T00:29:58+05:30 IST