ఎమ్మెల్సీ అనంతబాబుకు 14 రోజుల రిమాండ్

ABN , First Publish Date - 2022-05-24T04:37:31+05:30 IST

ఎమ్మెల్సీ అనంతబాబుకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును..

ఎమ్మెల్సీ అనంతబాబుకు 14 రోజుల రిమాండ్

కాకినాడ: ఎమ్మెల్సీ అనంతబాబుకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. దీంతో కేసు విచారించిన జడ్జి.. అనంతబాబుకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అనంతబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నెల 19న డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు చంపి మృతదేహాన్ని కారులో ఉంచి వదిలి వెళ్లాడు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2022-05-24T04:37:31+05:30 IST