కాకినాడ-ఎర్నాకులం మధ్య ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2022-01-04T16:20:01+05:30 IST

శబరిమల వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాకినాడ - ఎర్నాకులం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. ఈ నెల 4, 11వ తేదీల్లో సాయంత్రం 5 గంటలకు కాకినాడ టౌన్‌లో

కాకినాడ-ఎర్నాకులం మధ్య ప్రత్యేక రైళ్లు

అడయార్‌(చెన్నై): శబరిమల వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాకినాడ - ఎర్నాకులం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. ఈ నెల 4, 11వ తేదీల్లో సాయంత్రం 5 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరే ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ (07147) తిరుపతి-కాట్పాడి మీదుగా మరునాడు సాయంత్రం 3.15 గంటలకు ఎర్నాకులం చేరుకుంటుంది. అదే విధంగా ఈ నెల 5, 12 తేదీల్లో సాయంత్రం 7 గంటలకు ఎర్నాకులంలో బయలుదేరే ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ (07148) కాట్పాడి - తిరుపతి మీదుగా మరునాడు సాయంత్రం 7.30 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. ఒక ఏసీ టూ టైర్‌, రెండు ఏసీ త్రీటైర్‌, 10 స్లీపర్‌, 6 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌, 2 లగేజ్‌ బోగీలున్న ఈ రైళ్లు సామర్లకోట, ద్వారపూడి, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్డు, కోయంబత్తూర్‌, పాలక్కాడ్‌, త్రిశూర్‌ స్టేషన్లలో ఆగుతాయి.

Updated Date - 2022-01-04T16:20:01+05:30 IST