ఎంఎ్‌సఎంఈలకు రూ.6.66కోట్లు

ABN , First Publish Date - 2022-06-30T05:40:06+05:30 IST

కాకినాడ సిటీ, జూన్‌ 29: జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎ్‌సఎంఈ) పరిశ్రమలకు సంబంధించి 88 దరఖాస్తులకుగాను 83 దరఖాస్తులకు పరిశ్రమల ప్రోత్సాహకాల కింద రూ.6.66కోట్లు మంజూరు చేశామని కలెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌.. పరిశ్ర

ఎంఎ్‌సఎంఈలకు రూ.6.66కోట్లు
సమావేశంలో కలెక్టర్‌

కలెక్టర్‌ కృతికా శుక్లా

కాకినాడ సిటీ, జూన్‌ 29: జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎ్‌సఎంఈ) పరిశ్రమలకు సంబంధించి 88 దరఖాస్తులకుగాను 83 దరఖాస్తులకు పరిశ్రమల ప్రోత్సాహకాల కింద రూ.6.66కోట్లు మంజూరు చేశామని కలెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌.. పరిశ్రమలు, ఏపీఐఐసీ, గ్రౌండ్‌ వాటర్‌, ట్రాన్స్‌పోర్టు, అగ్నిమాపక, పంచాయతీ, ఫ్యాక్టరీస్‌, ట్రాన్స్‌కో, లీడ్‌ బ్యాంక్‌ శాఖల అధికారులతో జిల్లాస్థాయి పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. తొలుత గత మే నెలలో జరిగిన సమావేశంలో తీర్మానించిన అంశాలకు సంబంధించి తీసుకున్న చర్యలపై కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కాకినాడ జిల్లాకు సంబంధించి నూతన పరిశ్రమల స్థాపనకు ఏకపక్ష విధానంలో వచ్చిన 32 దరఖాస్తుల్లో 21 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశామన్నారు. నూతన ఎంఎ్‌సఎంఈ క్లస్టర్ల ఏర్పాటుపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఇందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమలశాఖ జీఎం టి.మురళి, ఏడీ కె.కృష్ణారావు, ఏపీఐఐసీ జడ్‌ఎం కె.లక్ష్మీఆండాళమ్మ, ఫ్యాక్టరీస్‌ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.సురేష్‌, ఎల్‌డీఎం ఎస్‌.శ్రీనివాసరావు, ట్రాన్స్‌కో ఈ ఈ ఎన్‌.ఉదయ్‌భాస్కర్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ ఏఈ ఈ బీబీ సవిత, కమర్షియల్‌ టాక్స్‌ ఏసీ కె.రాజశేఖర్‌, ఎస్సీ, ఎస్టీ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధి ఎన్‌.వెంకటరావు, కాకినాడ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధి పీవీ రావు, డిక్కీ ప్రతినిధి వై.రాజీవ్‌వర్మ పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T05:40:06+05:30 IST