మానసికస్థితి సరిగా లేని ఓ యువతి.. తన పుట్టినరోజు నాడే..

ABN , First Publish Date - 2020-08-14T13:02:27+05:30 IST

మానసికస్థితి సరిగా లేని ఒక యువతి పుట్టినరోజు నాడే..

మానసికస్థితి సరిగా లేని ఓ యువతి.. తన పుట్టినరోజు నాడే..

మానసిక స్థితి సరిగా లేని యువతి ఆత్మహత్య 

ఆకివీడులో పుట్టినరోజునే విషాదం


ఆకివీడు(పశ్చిమ గోదావరి): మానసికస్థితి సరిగా లేని ఒక యువతి పుట్టినరోజు నాడే ఆత్మహత్య చేసుకుంది. ఆకివీడు కాకర్లవీధిలో నివాసముంటున్న ఫ్యాన్సీ వ్యాపారి సోము కాశీ విశ్వనాథం పెద్ద కుమార్తె ఈశ్వరి నాగ రామలక్ష్మి (32) మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నది. ఆమె చెల్లెలికి వివాహమైంది. గురువారం ఈశ్వరి పుట్టినరోజు. ఉదయం పరమాన్నం చేసుకుని అందరూ తిన్నారు. తల్లిదండ్రులు, తమ్ముడు ఫ్యాన్సీ స్టోర్‌కి వెళ్లిన తర్వాత గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ చేసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అగ్నిమాపకశాఖ సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేసే సరికే ఆమె సజీవ దహనమైందని ఎస్‌ఐ వీరభద్రరావు తెలిపారు. తహసీల్దార్‌ సూర్యకుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-08-14T13:02:27+05:30 IST